దొర మాటిచ్చి నాలుగేండ్లైనా బీసీ సబ్ ప్లాన్ పత్తాలేదు.. కేసీఆర్ పై షర్మిల ఫైర్..

By AN TeluguFirst Published Oct 11, 2021, 11:13 AM IST
Highlights

‘దొర మాటిచ్చి నాలుగేండ్లయినా పత్తాలేని బీసీ పాలసీ అమలు, బీసీలంటే దొరగారి మీటింగ్లకు మందిని తెచ్చేవారు, గొర్లు, బర్లు కాసుకునేవారు, ఆత్మగౌరవ భవనాలకు అమ్ముడుపోయేవారు. అంతే తప్ప.. అధికారంలో పాలుపంచుకునేవారు, చట్టాలు చేసేందుకు అర్హులు కారు అభివృద్ధికి నోచుకునేవారు కాదు’ అన్నారు. 

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి ys sharmila మండిప‌డ్డారు. బీసీలకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారంటూ ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు. 

‘దొర మాటిచ్చి నాలుగేండ్లయినా పత్తాలేని బీసీ పాలసీ అమలు, బీసీలంటే దొరగారి మీటింగ్లకు మందిని తెచ్చేవారు, గొర్లు, బర్లు కాసుకునేవారు, ఆత్మగౌరవ భవనాలకు అమ్ముడుపోయేవారు. అంతే తప్ప.. అధికారంలో పాలుపంచుకునేవారు, చట్టాలు చేసేందుకు అర్హులు కారు అభివృద్ధికి నోచుకునేవారు కాదు’ అన్నారు. 

అంతేకాదు.. ‘అందుకే, కేసీఆర్ దొర 2017లో మీటింగ్ పెట్టి మూడు రోజులు ముచ్చట చేసిన 210 తీర్మానాలు మూలకు పెట్టిండు, BC sub-plan బీసీ సబ్ ప్లాన్ లేదు, ఇండస్ట్రీయల్ పాలసీ లేదు, నిధులు లేవు, పీజు రియింబర్స్మెంట్ లేదు.. 210 తీర్మానాలను గంగలో కలిపాడు కేసీఆరు. ఇది దొరగానికి 54 శాతం ఉన్న బీసీల మీద ఉన్న ప్రేమ’ అంటూ మండిపడ్డారు. 

వ్యూహాత్మకంగా షర్మిల.. ప్రశాంత్ కిశోర్ టీమ్‌తో కీలక భేటీ, ఇక పీకే కనుసన్నల్లోనే అడుగులు

kcr మీద వరుస ట్వీట్లతో షర్మిల దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. గత నెలలోనూ farmer సమస్యల మీద ఇలాగే దుమ్మెత్తిపోశారు.  రైతుల‌ను ఆదుకోకుండా వారిని క‌న్నీటిలో ముంచుతున్నార‌ని ఆమె ఆరోపించారు. 'రైతుల‌కు పెట్టుబడి రాకపోతే, పండిన పంట వరద పాలైతే, ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేస్తే, రైతు చావక ఇంకేం చేస్తాడు దొరా?' అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు.

'కేసీఆర్ ఒక్క రైతు బంధు ఇచ్చిండు. ఫసల్ బీమా బంద్ పెట్టిండు. పంటలకు బీమా లేదు, రైతుకు ధీమా లేదు, పంటలు వాన పాలు. కష్టం నీటి పాలు. రైతును కన్నీటిలో ముంచిండు' అని ష‌ర్మిల చెప్పారు. 'తాను పెద్ద రైతును అని చెప్పుకొనే దొరగారికి రైతు ఆత్మహత్యలు ఎందుకు చేసుకొంటున్నారో తెలియదట .. అందుకే కమిటీ వేసిండు. కోర్టులు మొట్టి కాయలు వేయనిదే మీకు ఏ పని చేయాలనే సోయి రాదు కానీ.. కనీసం ఇప్పటికైనా పంటల బీమాను అమలు చేసి రైతులను ఆదుకోండి' అని వైఎస్ ష‌ర్మిల డిమాండ్ చేశారు

click me!