తనకు భార్యను దూరం చేయడమే కాదు కేసు కూడా పెట్టించారన్న కోపంతో అత్తామామలపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ కసాయి అల్లుడు. ఈ దుర్ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
హైదరాబాద్: భార్యను తననుండి దూరం చేశారన్న కోపంతో అత్తామామలపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు అల్లుడు. అత్తవారింటికి వెళ్లి భార్యతో గొడవకుదిగిన అల్లుడు వెంటతెచ్చుకున్న పెట్రోల్ ను అత్తామామపై పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ దంపతులు హైదారాబాద్ లోని గాంధీలో చికిత్సపొందుతున్నారు.
వివరాల్లోకి వెళితే... కరీంనగర్ జిల్లాకు చెందిన నిఖిత సాఫ్ట్ వేర్ ఇంజనీర్. హైదరాబాద్ మాదాపూర్ లోని ఓ కార్పోరేట్ కంపనీలో పనిచేస్తోంది. అయితే 2016లో ఆమెకు కరీంనగర్ జిల్లాకే చెందిన సాయికృష్ణతో వివాహమైంది. పెళ్ళి సమయంలోనే కట్నకానుకలిచ్చినా అదనపు కట్నం కోసి నిఖితను వేధించడం ప్రారంభించాడు.
భర్త వేధింపులు రోజురోజుకు ఎక్కువ కావడంతో నిఖిత 2019లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసారు. ఆ తర్వాత నిఖిత భర్తకు దూరంగా తల్లిదండ్రులు సాగర్‌రావు, రమాదేవిలతో కలిసి కేపీహెచ్‌బీ కాలనీలో వుంటోంది.
read more Illegal affair : భర్త తలను గోడకేసి బాది.. హత్యచేసిన భార్య
అయితే తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిఖితపైనే కాదు అత్తామామలపై కోపాన్ని పెంచుకున్నాడు సాయికృష్ణ. ఈ క్రమంలో శనివారం అత్తవారింటికి వెళ్లిన అతడు యాసిడ్ దాడి చేస్తానంటూ భార్యను బెదిరించాడు. దీంతో ఆమె ఓ గదిలోకి వెళ్లి గడియపెట్టుకుంది. ఎంతకూ ఆమె భయటకు రాకపోవడంతో మరింత ఆగ్రహానికి గురయిన అతడు తనవెంట తెచ్చుకున్న పెట్రోల్ అత్తామామలపై పోసి నిప్పంటించి పరారయ్యాడు.
తల్లిదండ్రుల కేకలు విని గదిలోంచి నిఖిత బయటకు వచ్చేసరికి మంటల్లో కాలుతూ వున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని నిఖిత గాంధీ హాస్పిటల్ కు తరలించించింది. నిఖిత ఫిర్యాదుతో సాయకృష్ణపై మరో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.