Huzurabad bypoll:బండి సంజయ్, రేవంత్ కి ప్రతిష్టాత్మకం, సర్వ శక్తులను ఒడ్డుతున్న నేతలు

By narsimha lodeFirst Published Oct 27, 2021, 4:14 PM IST
Highlights

హుజూరాబాద్ ఉప ఎన్నిక బీజేపీ చీఫ్ బండి సంజయ్ , టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కీలకం. ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించి టీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని ఈ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఓటర్లు ఎవరికి పట్టం కడుతారనే విషయాన్ని నవంబర్ 2న తేల్చనున్నారు.

కరీంనగర్:Huzurabad bypoll లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్‌లకు ప్రతిష్టాత్మకమే. Revanth Reddy టీపీసీసీ చీఫ్ గా నియామకం జరిగిన తర్వాత జరుగుతున్న తొలి ఉప ఎన్నిక. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం ఉంది. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక Bandi Sanjayకి కీలకంగా మారింది.పార్టీలో సీనియర్లు వ్యతిరేకించినా కూడ రేవంత్ రెడ్డికిTpccపగ్గాలు అప్పగించింది పార్టీ నాయకత్వం. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. 

also read:సర్వే రిపోర్టులొచ్చాయి, హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్‌దే గెలుపు: హరీష్ రావు

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో సుమారు నాలుగు మాసాల నుండి Bjp,Trsలు ప్రచారం నిర్వహిస్తున్నాయి.Etela Rajender తొలుత ఈ నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించారు.  టీఆర్ఎస్ అభ్యర్ధిని తొలుత ప్రకటించలేదు. కానీ ఆ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత కొంత కాలానికి Gellu Srinivas Yadavను అభ్యర్ధిగా ప్రకటించింది.ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధిగా బల్మూరి వెంకట్ ను ప్రకటించింది.

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాన్ని రిపీట్ చేస్తామని కమలదళం ధీమాగా ఉంది. నాలుగు మాసాలుగా ఆ పార్టీకి చెందిన కీలక నేతలు హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే మకాం వేశారు. గత ఎన్నికల్లో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధికి 1683 ఓట్లు మాత్రమే వచ్చాయి.అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఈ స్థానం నుండి బండి సంజయ్ విజయం సాధించారు. సంజయ్ ప్రస్తుతం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించి రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ వ్యూహాంతో ముందుకు వెళ్తోంది. అయితే దుబ్బాక ఉప ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించినా నాగార్జునసాగర్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన స్థానాలను కైవసం చేసుకొంది. ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నికలను కమలం పార్టీ సీరియస్ గా తీసుకొంది.ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు కమలం పార్టీ సర్వశక్తులను ఒడ్డుతుంది. 

హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ, టీఆర్ఎస్‌తో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో కాస్త వెనుకబడే ఉంది. అయితే చివరి నిమిషంలో అభ్యర్ధిని ప్రకటించడం కూడా ఇందుకు కారణంగా ఆ పార్టీ నాయకత్వం చెబుతుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా కౌశిక్ రెడ్డి  పోటీ చేసి 61,121 ఓట్లను సాధించాడు. పోలైన ఓట్లలో ఆయనకు 34.60 శాతం ఓట్లు దక్కాయి. అయితే కౌశిక్ రెడ్డి ప్రస్తుతం టీఆర్ఎస్ లో చేరాడు. ఈ పరిణామం కాంగ్రెస్ కు ఇబ్బందిగా మారింది. అయితే గత ఎన్నికల్లో వచ్చిన ఓటు బ్యాంకును నిలుపుకొంటుందా  లేదా అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా ఆ పార్టీకి చెందిన అగ్రనేతలంతా ఈ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ వెంకట్ తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితం సాధించకపోతే రేవంత్ రెడ్డిపై ప్రత్యర్ధులకు అవకాశం చిక్కుతుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తామే ప్రత్యామ్నాయం అని కాంగ్రెస్ చెబుతుంది. 

వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉంది. అయితే ఈ రెండేళ్ల కాలంలో రాజకీయ సమీకరణాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకొనే అవకాశం లేకపోలేదు. అయితే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని నిరూపించుకొనేందుకు బీజేపీ, కాంగ్రెస్ లు  శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందు కోసం ఈ హుజూరాబాద్ ఉప ఎన్నికను ఆ పార్టీలు ఉపయోగించుకొంటున్నాయి. దీంతో  రేవంత్ రెడ్డికి, బండి సంజయ్‌కి ఈ ఉప ఎన్నిక కీలకమైందేనని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.


 

click me!