వైఎస్ షర్మిల పాదయాత్రలో పాల్గొన్న యాంకర్ శ్యామల.. సంతోషంగా ఉందంటూ కామెంట్స్..

Published : Oct 27, 2021, 04:03 PM IST
వైఎస్ షర్మిల పాదయాత్రలో పాల్గొన్న యాంకర్ శ్యామల.. సంతోషంగా ఉందంటూ కామెంట్స్..

సారాంశం

వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSR telangana party) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) ప్రజా ప్రస్థానం పేరుతో తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. బుధవారం వైఎస్ షర్మిల పాదయాత్రలో ప్రముఖ యాంకర్ శ్యామల పాల్గొన్నారు.  

వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSR telangana party) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) ప్రజా ప్రస్థానం పేరుతో తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. మొత్తం 90 అసెంబ్లీ, 14 లోక్‌సభ నియోజకవర్గాల మీదుగా మొత్తం 4వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. తన పాదయాత్రలో ప్రజ సమస్యలు తెలుసుకుంటూ షర్మిల ముందుకు సాగుతున్నారు. బుధవారం వైఎస్ షర్మిల పాదయాత్ర 8వ రోజుకు చేరింది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో ఆమె పాదయాత్ర కొనసాగిస్తున్నారు. 8వ రోజు పాదయాత్ర రాచలూర్ గ్రామం నుంచి ప్రజాప్రస్థానం  పాదయాత్ర ప్రారంభమైంది. అభిమానులు, స్థానికులు, వైఎస్సార్ టిపి నాయకులు, కార్యకర్తల వెనకరాగా షర్మిల ముందునడిచారు.

బుధవారం వైఎస్ షర్మిల పాదయాత్రలో ప్రముఖ యాంకర్ శ్యామల పాల్గొన్నారు. షర్మిలతో కలిసి నడిచారు. శ్యామలతో పాటు ఆమె భర్త నరసింహ రెడ్డి కూడా వైఎస్ షర్మిల పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్యామల మాట్లాడుతూ.. సమాజంలో మార్పు కోసం షర్మిల చేస్తున్న పాదయాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. షర్మిలతో కలిసి నడవడానికి తాను సిద్ధమని Anchor Shyamala అన్నారు.  

Also read: తెలంగాణ ఉట్నూరు మద్యం డిపోలో భారీ అగ్ని ప్రమాదం.. రూ. కోట్లలో ఆస్తి నష్టం..!

తాను మొదటి నుంచి వైఎస్సార్ కుటుంబానికి అభిమాని అని శ్యామల అన్నారు. షర్మిల పాదయాత్రకు మద్దతు తెలిపేందుకే ఇక్కడికి వచ్చినట్టుగా పేర్కొన్నారు. తన అక్క షర్మిల ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారని.. ప్రతి ఒక్కరూ తమ సమస్యలను అక్కతో చెప్పడం తాను స్వయంగా చూశానన్నారు. 

Also read: మోదీ ర్యాలీ వద్ద పేలుళ్ల కేసు.. 9 మందిని దోషులుగా నిర్దారించిన ఎన్‌ఐఏ కోర్టు..

వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటుకు ముందు.. యాంకర్ శ్యామల, తన భర్త నర్సింహ రెడ్డితో కలిసి లోటస్‌పాండ్‌కు వెళ్లి షర్మిలను కలిశారు. షర్మిల పార్టీ పెడితే చేరేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. షర్మిలతో కలిసి నడుస్తామని శ్యామల దంపతులు చెప్పారు. అయితే 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మందు.. యాంకర్ శ్యామల దంపతులు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో.. ఆ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇక, శ్యామల.. యాంకర్‌గా, నటిగా రాణిస్తున్నారు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2లో ఆమె కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు