Huzurabad Bypoll: టీఆర్ఎస్ షాక్... నామినేషన్ల కోసం బారులుతీరిన ఫీల్డ్ అసిస్టెంట్లు, నిరుద్యోగులు

By Arun Kumar PFirst Published Oct 7, 2021, 1:35 PM IST
Highlights

హుజురాబాద్ ఉపఎన్నికలో పోటీకి సిద్దమైన ఫీల్డ్ అసిస్టెంట్లు, నిరుద్యోగులు నామినేషన్లు వేయడానికి ఆర్టీవో కార్యాలయానికి భారీగా చేరుకుంటున్నారు. నామినేషన్ పత్రాలతో వీరంతా బారులు తీరారు. 

కరీంనగర్: ప్రభుత్వం తమను అన్యాయంగా ఉద్యోగాల నుండి తొలగించిందని ఆరోపిస్తున్న ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు లో పోటీకి సిద్దమయ్యారు. నిజామాబాద్ లో పసుపు రైతుల మాదిరిగానే అధికార టీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ది చెబుతామని... ఆ పార్టీ గెలుపు అవకాశాలు దెబ్బతీసి తమ సత్తా చాటుతామని ఫీల్డ్ అసిస్టెంట్లు అంటున్నారు. ఈ క్రమంలోనే హుజురాబాద్ లో నామినేషన్ వేయడానికి ఫీల్డ్ అసిస్టెంట్లు హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. 

నామినేషన్ పత్రాలను చేతబట్టుకుని ఫీల్డ్ అసిస్టెంట్లు ఆర్డీవో కార్యాలయం వెలుపల బారులు తీరారు. వీరే కాకుండా నిరుద్యోగులు కూడా ఉద్యోగాల భర్తీ విషయంలో TRS సర్కార్ పై గుర్రుగా వున్నారు. వారుకూడా huzurabad bypoll లో ఫోటీకి సిద్దమయ్యారు. రిటైర్డ్ ఉద్యోగులు సైతం హుజురాబాద్ లో బరిలో దిగేందుకు సిద్దమయ్యారు. వీరంతా నామినేషన్లు వేయడానికి ఆర్డీవో కార్యాలయానికి చేరుకోవడంతో ఆ ప్రాంగణమంతా వీరితోనే నిండిపోయింది. 

నామినేషన్ గడువు అక్టోబర్ 8వ తేదీవరకే వుంది. దీంతో కేవలం రెండురోజులే సమయం వుండటంతో ఇవాళ(గురువారం) నామినేషన్ వేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.  గత  శుక్రవారం నుండి నామినేషన్ల స్వీకరణ ప్రారంభంకాగా నిన్నటివరకు కేవలం తొమ్మిది మంది అభ్యర్థులు మాత్రమే 13 సెట్లు దాఖలుచేశారు. అయితే రెండు రోజులే నామినేషన్ కు సమయం ఉండడంతో భారీగా అభ్యర్థులు ఆర్డివో కార్యాలయం వద్దకు చేరుకుంటున్నారు. 

వీడియో

అయితే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైనప్పటి నుండి ఫీల్డ్ అసిస్టెంట్లు, నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు నామినేషన్ వేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అధికారులు మాత్రం నిబందనల పేరుతో వారిని  అడ్డుకోవడమే కాకుండా కోవిడ్ నిబందనలు పాటించడం లేదని కేసులు కూడా నమోదు చేస్తున్నారు. దీంతో ఒకేసారి మూకుమ్మడికి నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయించుకున్న వీరంతా ఆర్డివో కార్యాలయం వద్ద నామినేషన్  పత్రాలతో బారులు తీరారు. 

read more  Huzurabad Bypoll: దూకుడుపెంచిన ఈటల... బిజెపిలోకి భారీ చేరికలు (వీడియో)

ఇక ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి గెలు శ్రీనివాస్ యాదవ్ మొదటిరోజే నామినేషన్ వేసారు. ఇక eatala rajenderసతీమణి ఈటల జమున ముందుజాగ్రత్తగా BJP తరపున నామినేషన్ దాఖలు చేశారు. బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ తో పాటు కాంగ్రెస్ అభ్యర్థి  బల్మూరు వెంకట్‌ చివరిరోజు అంటే రేపు నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. నామినేషన్ల ప్రక్రియ ముగింపుకు సమయం దగ్గరపడుతుండటం... ప్రధాన పార్టీ అభ్యర్థుల ఇంకా నామినేషన్లు ఇంకా మిగిలి ఉండడం, ఫీల్డ్ అసిస్టెంట్లు,నిరుద్యోగులు భారీగా నామినేషన్లు వేయడానికి సిద్దపడటంతో హుజురాబాద్ ఆర్డివో కార్యాయలం వద్ద అయోమయ పరిస్థితి నెలకొంది.

ఇక హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి గత శుక్రవారం(అక్టోబర్ 1వ తేదీన) ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు అధికారులు. ఇదేరోజు నుండి నామినేషన్ స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభమయ్యింది. ఈ నెల 8వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అక్టోబర్ 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 13న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 2 న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్టుగా ఈసీ తెలిపింది.

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలోకి దిగుతున్నారు. ఇదే స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా విద్యార్థిసంఘం నాయకుడు gellu srinivas yadav, కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్‌ఎస్‌‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు balmoor venkat (వెంకట నర్సింగరావు) బరిలోకి దిగుతున్నారు. 
 
 

click me!