ఉపరాష్ట్రపతిగా కేసీఆర్.. తెలంగాణ సీఎంగా కేటీఆర్?

Published : Oct 07, 2021, 12:40 PM ISTUpdated : Oct 07, 2021, 12:43 PM IST
ఉపరాష్ట్రపతిగా కేసీఆర్.. తెలంగాణ సీఎంగా కేటీఆర్?

సారాంశం

కేసీఆర జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్నారని, తర్వాత తెలంగాణ సీఎంగా కేటీఆర్ బాధ్యతలు తీసుకుంటారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పదవీకాలం పూర్తయిన తర్వాత కేసీఆర్‌కే ఆ చాన్స్ దక్కే అవకాశముందని కథనాలు వెలువడుతున్నాయి. ఉపరాష్ట్రపతి కావాలని కేసీఆర్‌కు ఉన్నదని, అందుకు బీజేపీ కూడా సానుకూలంగా ఉన్నదని వాదనలు వినిపిస్తున్నాయి.

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి kcr జాతీయ రాజకీయాలపై కాన్సంట్రేట్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. గత నెలలో ఆయన రెండు సార్లు delhi పర్యటన చేశారు. అక్కడ తెలంగాణ భవన్‌కు శంకుస్థాపన చేశారు. ఢిల్లీలోనే వారంపాటు ఆయన మకాం వేశారు. ఈ సమయంలో ప్రధానమంత్రి narendra modi, amit shah సహా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీల నేపథ్యంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని పావులు కదుపుతున్నట్టు గుసగుసలు వినిపించాయి. తాజాగా, అసెంబ్లీలో ఆయన కేంద్ర రాజకీయాలు, అందులో టీఆర్ఎస్ ప్రమేయం పై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో మరోసారి జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఎంట్రీపై చర్చ జోరందుకుంది.

వాస్తవానికి గత సార్వత్రిక ఎన్నికలకు ముందే ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగానే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. బెంగాల్ సీఎం మమతా బెనర్జీతోనూ ఆయన భేటీ అయ్యారు. తర్వాత స్వయంగా ఆయనే third front వార్తలను కొట్టేసినా, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆసక్తిని ఆయనే వెల్లడించారు. కానీ, కేంద్రంలో ఎన్డీయే పూర్తి మెజార్టీతో అధికారంలోకి రావడంతో కేసీఆర్ ఆలోచనలు రూపం దాల్చుకోలేవు.

రాష్ట్రంలో bjpతో కాలుదువ్వుతున్నా.. కేంద్రంలో ప్రధాని మోడీ, అమిత్ షాలతో సన్నిహితంగా మెదులుతూ సాన్నిహిత్యంగా మెదులుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. అవి కేంద్రం, రాష్ట్ర సంబంధాలని రాష్ట్రంలో బీజేపీ నేతలు కొట్టిపారేస్తున్నా.. అసలు కథ వేరే ఉన్నదనే వాదనలు ఆగడం లేదు.

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్నారన్న ప్రచారం మళ్లీ మొదలైంది. కేసీఆర్ vice president కావాలని కోరుకుంటున్నారని.. బీజేపీ కూడా ఇందుకు సుముఖంగా ఉన్నదనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం దక్షిణాది నేత ఎం వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా బాధ్యతల్లో ఉన్నారు. ఆయన పదవీ కాలం పూర్తయిన తర్వాత కేసీఆర్‌కు ఆ అవకాశం దక్కనుందనే వాదనలు పెరుగుతున్నాయి. ఇన్నాళ్లు దక్షిణాది, తెలుగు నేతనే ఉపరాష్ట్రపతిగా ఉండగా మరోసారి అదే దక్షిణాది, తెలుగు నేత కేసీఆర్‌కు ఆ అవకాశం ఇస్తారా? అనేదానిపైనా చర్చ ఉన్నది.

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే రాష్ట్ర సీఎంగా కేటీఆర్ బాధ్యతలు తీసుకుంటారన్న ప్రచారం పాతదే. కానీ, తాజా వాదనలతో ఇదే టాపిక్ మళ్లీ ముందుకు వచ్చింది. కేటీఆర్ సీఎంగా బాధ్యతలు తీసుకుంటారని, ఇప్పటికే ఆయనకు పార్టీపై బలమైన పట్టు ఉన్నదని రాజకీయవర్గాలు చెప్పుకుంటున్నాయి. కాగా, హరీశ్ రావును కేంద్ర క్యాబినెట్‌లోకి పంపనున్నట్టు తెలుస్తున్నది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు