రాజేంద్ర‌నగర్ లో అదృశ్యమైన అనీష్ కథ విషాదాంతం: ఇంటి వెనుక చెరువులో డెడ్‌బాడీ

Published : Oct 22, 2021, 12:36 PM ISTUpdated : Oct 22, 2021, 12:42 PM IST
రాజేంద్ర‌నగర్ లో అదృశ్యమైన అనీష్ కథ విషాదాంతం: ఇంటి వెనుక చెరువులో డెడ్‌బాడీ

సారాంశం

హైద్రాబాద్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరేళ్ల బాలుడు అనీష్ అదృశ్యం విషాదాంతంగా ముగిసింది. ఇంటి వెనుక చెరువులో అనీష్ డెడ్ బాడీ  లభించింది.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని Rajendranagar పోలీస్ స్టేషన్ పరిధిలో గల హైదర్‌గూడలో ఆరేళ్ల బాలుడి అదృశ్యం విషాదాంతమైంది. ఇంటి వెనుక ఉన్న చెరువులో Anish డెడ్‌బాడీ లభ్యమైంది. ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం అనీష్ ఇంట్లో నుండి ఆడుకొంటూ కిందకు వచ్చిన తర్వాత కన్పించకుండాపోయాడు.

also read:అనంతపురంలో దారుణం: రెండు నెలల చిన్నారి చంపిన తండ్రి

బాలుడి కోసం గాలించినా  ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిన్న మధ్యాహ్నం నుండి అనీష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఫలితం దొరకలేదు.  ఈ ప్రాంతంలోని సీసీటీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.ఇంటి వెనుక  ఉన్న  చెరువులో అనీష్  డెడ్‌బాడీని ఇవాళ స్థానికులు గుర్తించారు.ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చెరువు నుండి అనీష్ డెడ్‌బాడీని బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే అనీష్ చెరువు వద్దకు వెళ్లాడు.  చెరువులో ప్రమాదవశాత్తు పడిపోయాడా  ఎవరైనా హత్య చేసి చెరువులో వేశారా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చెరువు వద్ద ఉన్న ఆనవాళ్లను చూసిన కుటుంబసభ్యులు అనీష్ ను ఎవరైనా అతడిని చెరువులో తోసేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అయితే తమకు ఎవరిమీద అనుమానం లేదని అనీష్ నానమ్మ మీడియాకు చెప్పారు. అనీష్  డెడ్‌బాడీని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేయాలని  పోలీసులను మృతుడి పేరేంట్స్ కోరుతున్నారు.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి తొలి దర్శనం | First Darshan of Ujjaini Mahankali Temple | Bonalu 2026
Weather Update: రాబోయే 3 రోజులు వానలు.. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. వాతావరణ శాఖ హెచ్చరిక