హుజురాబాద్‌లో తల కిందికి కాళ్లు పైకి పెట్టినా ఈటల రాజేందర్ గెలవడని మంత్రి హరీశ్ జోస్యం చెప్పారు. గెల్లు శ్రీను టీఆర్ఎస్‌వీ నుంచి 2001 నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాడని ఆయన తెలిపారు.
ఈటల రాజేందర్ పెట్టిన కష్టాలతో పోచమల్లు టీఆర్ఎస్‌లో చేరారని అన్నారు మంత్రి హరీశ్ రావు. ఈ రోజు గెలిచేది న్యాయం ధర్మమేమని ఆయన వ్యాఖ్యానించారు. ఈటల మాటలకు చేతలకు సంబంధం లేదంటూ హరీశ్ ఎద్దేవా చేశారు. రక్త సంబంధం కంటే మానవ సంబంధం గొప్పది అన్న ఈటల ఈరోజు మత్తతత్వ పార్టీలో చేరారని ఆయన మండిపడ్డారు. తల కిందికి కాళ్లు పైకి పెట్టినా హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల గెలవడని హరీశ్ జోస్యం చెప్పారు. గెల్లు శ్రీను టీఆర్ఎస్‌వీ నుంచి 2001 నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాడని ఆయన తెలిపారు. ఉస్మానియాలో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఉరికిచ్చిన వ్యక్తి గెల్లు శ్రీను అని హరీశ్ ప్రశంసించారు. ఈటల గడియారాలు పంచినా గెలిచేది టీఆర్ఎస్సేనని.. హుజురాబాద్ టీఆర్ఎస్ అడ్డా అని ఆయన స్పష్టం చేశారు.
అంతకుముందు హుజురాబాద్‌లోని ప్రతి కుటుంబానికి దళిత బంధును నూటికి నూరు శాతం అందజేస్తామన్నారు మంత్రి హరీశ్ రావు. శనివారం హుజురాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎటువంటి చెప్పుడు మాటలు వినొద్దని, అనుమానాలు, అపోహాలకు తావు లేదని తెలిపారు. రైతు బంధు కార్యక్రమాన్ని కూడా హుజురాబాద్ నియోజకవర్గంలోనే కేసీఆర్ ప్రారంభించారని హరీశ్ రావు గుర్తుచేశారు.
undefined
Also Read:దళిత బంధు అందరికీ ఇవ్వాలి.. లేకుంటే ఉద్యమమే: కేసీఆర్‌కు ఈటల రాజేందర్ హెచ్చరిక
ఆ సమయంలో కూడా ఇది కొద్దిమందికే వస్తుందని కొందరు.. వున్నత వర్గాలకే వస్తుందని మరికొందరు, ఇది కేవలం ఎన్నికల స్టంట్ అని బీజేపీ, కాంగ్రెస్ నేతలు మాట్లాడారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. కానీ రైతు బంధు నిరాటంకంగా, కరోనా సమయంలోనూ కొనసాగుతోందని చెప్పారు. ఇదే రైతు బంధుని హుజురాబాద్‌లో ప్రారంభించినప్పుడు చప్పట్లు కొట్టిన నాయకులే .. ఇవాళ దళిత బంధు ప్రారంభిస్తామంటే అదే చేతులతో గుండెలు బాదుకుంటున్నారని మండిపడ్డారు.