పటేల్‌తో మోడీ, పీవీతో కేసీఆర్ ... చరిత్ర చెప్పుకుని ఇద్దరూ బతికేస్తున్నారు: భట్టి విక్రమార్క

By Siva KodatiFirst Published Aug 15, 2021, 4:07 PM IST
Highlights

సర్దార్ పటేల్ చరిత్ర చెప్పుకొని ప్రధాని నరేంద్ర మోడీ.. పీవీ నర్సింహారావు చరిత్ర చెప్పుకొని సీఎం కేసీఆర్ బతికే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. దళిత బంధును ఒక్క హుజూరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అమలు చేయాలని భట్టి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

దేశానికి కాంగ్రెస్‌ పార్టీ తీసుకొచ్చిన స్వాతంత్య్రాన్ని, ఆర్థిక పరిస్థితిని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం చిన్నాభిన్నం చేస్తోందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. స్వాతంత్ర్య సమరయోధులు, కాంగ్రెస్ ఉద్యమనేతలు, మహనీయుల చరిత్రను తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీయేనని ..దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చింది కాంగ్రెస్ పార్టీ అని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. నేటి పాలకులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, స్వేచ్ఛను హరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. 

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని, పేదరికంలో ఉన్న దళితుల కోసం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను కాంగ్రెస్‌ తీసుకొచ్చిందని భట్టి గుర్తుచేశారు. గడిచిన ఏడేళ్ళుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఉప ప్రణాళికను సక్రమంగా అమలు చేయలేదని విక్రమార్క ఆరోపించారు. గతంలో ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయలేదని.. ఎన్నికల కోసమే ఈ పథకాన్ని అస్త్రంగా వాడుకొని వదిలేస్తారేమోననే సందేహాన్ని భట్టి వ్యక్తం చేశారు. సర్దార్ పటేల్ చరిత్ర చెప్పుకొని ప్రధాని నరేంద్ర మోడీ.. పీవీ నర్సింహారావు చరిత్ర చెప్పుకొని సీఎం కేసీఆర్ బతికే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. దళిత బంధును ఒక్క హుజూరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అమలు చేయాలని భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

click me!