హుజూర్ నగర్ ఎఫెక్ట్: రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పల్లా

By telugu teamFirst Published Nov 16, 2019, 3:01 PM IST
Highlights

రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించనుంది.  ఈ నేపథ్యంలో నియామక ప్రక్రియ చేపట్టాలని అధికారులకు కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. త్వరలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి సభ్యుల నియామకం జరగనున్నా విషయం తెలిసిందే. 

రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించనుంది.  ఈ నేపథ్యంలో నియామక ప్రక్రియ చేపట్టాలని అధికారులకు కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. త్వరలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి సభ్యుల నియామకం జరగనున్నా విషయం తెలిసిందే. 

గతంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా గుత్తా సుఖేందర్ రెడ్డి ఉండేవారు. ఆయన ప్రస్తుతం మండలి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడంతో, ఈ ఖాళీ ఏర్పడింది. మొన్నటి హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అన్ని తానై వ్యవహరించిన పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఈ పదవిని కట్టబెట్టనున్నారు. వాస్తవానికి అతనికి మంత్రి పదవి దక్కుద్దని అందరూ భావించినా, కాబినెట్ హోదా కలిగిన ఈ పదవిని కేసీఆర్ కట్టబెట్టారు. 

‘‘తెలంగాణలో రైతులు ఒకప్పుడు ఎంతో గౌరవంగా బతికేవారు. మంచి వ్యవసాయం సాగేది. రైతులే ఇతరులకు దానాలు చేసే మంచిస్థితిలో ఉండేవారు. కానీ రాను రాను పరిస్థితి మారింది. సమైక్య రాష్ట్రంలో అవలంభించిన విధానాల వల్ల వ్యవసాయ రంగం దెబ్బతిన్నది. రైతులు అన్ని విధాలా నష్టపోయారు. తెలంగాణ వచ్చినంక రైతుల పరిస్థితి మారాలని అనుకున్నాం. అందుకే తెలంగాణ వచ్చినంక వ్యవసాయ రంగాభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకున్నాం. మొదట రైతులకు రుణమాఫీ చేసుకున్నం. సాగునీటి ప్రాజెక్టులు కట్టుకుంటున్నం. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులతో పాటు ఇతర ప్రాజెక్టులు శరవేగంగా పూర్తవుతున్నాయి. 24 గంటల ఉచిత విద్యుత్ అందుతున్నది. ఎరువులు, విత్తనాలు సకాలంలో ఇచ్చుకుంటున్నాం. ఇట్ల చాలా చేసుకుంటూ పోతున్నం. భూరికార్డుల ప్రక్షాళన చేసి, కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చాం. రైతులు పెట్టుబడి కోసం అప్పు చేయకుండా ప్రభుత్వమే పెట్టుబడి ఇస్తున్నది. అందుకోసమే ఎకరానికి 8వేలు ఇస్తున్నాం. దీనితో పాటు రైతులకు జీవిత బీమా చేయాలని నిర్ణయించాం. ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేయడానికి రైతు సమన్వయ సమితిలు కీలక పాత్ర పోషించాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో అన్నారు.

‘‘రైతులకు కరెంటు బాధ పోయింది. నీళ్ల బాధ పోతోంది. పెట్టుబడి ఎట్ల అనే రంది లేదు. ఇక కావాల్సింది గిట్టుబాటు ధర. దాని కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. దుక్కి దున్నిన దగ్గర నుంచి రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు ప్రతీ దశలో రైతులకు ఏం కావాలో ప్రభుత్వం ఆ పని చేస్తుంది. దానికి అనుగుణంగా రైతులను సమన్వయ పరిచే బాధ్యత రైతు సమన్వయ సమితులు చేపట్టాలి. ఇజ్రాయిల్ దేశంలో లాభదాయక వ్యవసాయం సాగుతున్నది. అక్కడ ఉత్పత్తి, ఉత్పాదకత ఎక్కువ. అత్యాధునిక పద్దతులు పాటించి, అత్యధిక దిగుబడులు పొందుతున్నారు. రైతు సమన్వయ సమితుల జిల్లా కో ఆర్డినేటర్లు ఇజ్రాయిల్ సందర్శించాలి. అక్కడి వ్యవసాయ పద్ధతులు చూసి నేర్చుకుని రావాలి. ప్రభుత్వమే ఖర్చు భరించి, ఇజ్రాయిల్ పర్యటన ఏర్పాటు చేస్తాం’’ అని కూడా సీఎం గతంలో చెప్పారు.

జూన్‌ నాటికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు.. రైతు సమన్వయ సమితులను బలోపేతం చేస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. రైతు సమన్వయ సమితుల బలోపేతం, రైతు వేదికల నిర్మాణం చేపడతామని అన్నారు. ఇతర అంశాలపై నాలుగు రోజుల్లో కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు.

click me!