హైద్రాబాద్ వనస్థలిపురం గౌతమినగర్ లో భార్యను హత్య చేశాడు భర్త, గొంతుకోసి ఫస్ట్‌ఫ్లోర్ నుండి కిందకు తోసేశాడు నిందితుడు.
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం గౌతమీనగర్ లో శుక్రవారంనాడు దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భార్య గొంతుకోసి ఫస్ట్‌ఫ్లోర్ నుండి కింద పడేశాడు భర్త. రాజ్ కుమార్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు.హైకోర్టు నాలుగో గేటు వద్ద రాజ్ కుమార్ విధులు నిర్వహిస్తున్నాడు.
భార్యతో కలిసి వనస్థలిపురం గౌతమీనగర్ లో రాజ్ కుమార్ నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహలతో భార్య శోభను రాజ్ కుమార్ హత్య చేశాడు. భార్య గొంతు కోసి ఫస్ట్ ఫ్లోర్ నుండి కింద పడేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. ఎల్‌బీనగర్ డీసీపీ సాయిశ్రీ నేతృత్వంలోని పోలీస్ బృందం ఘటన స్థలంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తన భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో రాజ్ కుమార్ శోభతో గొడవకు దిగేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు.
వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం ఏం చెప్పారంటే
వనస్థలిపురం గౌతమీనగర్ లో కత్తిదాడి జరిగిందని తమకు సమాచారం అందిందని వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం చెప్పారు. కానీ స్పాట్ కు వెళ్లి చూస్తే శోభ రక్తం మడుగులో పడిఉందన్నారు. శోభ నిన్న వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో రాజ్ కుమార్ పై ఫిర్యాదు చేసిందన్నారు దీంతో కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్టుగా ఏసీపీ పురుషోత్తం తెలిపారు. కుటుంబ కలహల నేపథ్యంలో ఇవాళ ఉదయం శోభపై కత్తితో రాజ్ కుమార్ దాడి చేశాడన్నారు. ఈ దాడిని కొడుకు ప్రయత్నించారన్నారు. ఈ ఘటనలో శోభ కొడుకుకు కూడా గాయాలయ్యాయని ఏసీపీ పురుషోత్తం తెలిపారు. నిందితుడు రాజ్ కుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టుగా ఏసీపీ తెలిపారు.