జీతం అడిగిందని భార్యను చంపిన భర్త: ఆత్మహత్యగా చిత్రీకరణ.. పట్టించిన యజమాని

Siva Kodati |  
Published : May 22, 2020, 10:03 PM IST
జీతం అడిగిందని భార్యను చంపిన భర్త: ఆత్మహత్యగా చిత్రీకరణ.. పట్టించిన యజమాని

సారాంశం

చిన్న చిన్న విషయాలకే భార్యల ప్రాణాలను తీస్తున్న వారి సంఖ్య ఇటీవలికాలంలో ఎక్కువవుతున్నాయి. తాజాగా జీతం డబ్బులు అడిగినందుకు భార్యను హత్య చేశాడో భర్త

చిన్న చిన్న విషయాలకే భార్యల ప్రాణాలను తీస్తున్న వారి సంఖ్య ఇటీవలికాలంలో ఎక్కువవుతున్నాయి. తాజాగా జీతం డబ్బులు అడిగినందుకు భార్యను హత్య చేశాడో భర్త.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరంలోని ఏఎస్ రావు నగర్‌కు చెందిన సంతోష్ చౌహన్.. స్థానికంగా వ్యాపారం చేస్తున్న పరమేశ్ పాటిల్ దగ్గర పనిచేస్తున్నాడు. అయితే గత రాత్రి జీతం డబ్బుల విషయమై భార్య దీపాలి చౌహన్‌తో గొడవపడ్డాడు సంతోష్.

Also Read:భార్య అక్రమ సంబంధం.. ప్రియుడికి కరోనా మందు అని చెప్పి..

ఈ క్రమంలో ఆమె తన భర్తపై కోపంతో వంటగదిలోకి వెళ్లి అక్కడ ఉన్న పట్టుకారును అతనిపై విసిరేసింది. దీంతో కోపోద్రిక్తుడైన సంతోష్ భార్య దీపాలి గొంతు నులిమి హతమార్చాడు.

ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న సంతోష్.. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు గాను భార్య సూసైడ్‌గా చేసుకుందని స్నేహితులకు ఫోన్ చేసి చెప్పాడు. విషయం తెలుసుకున్న సంతోష్ యజమాని పరమేశ్ కుషాయిగూడ పోలీసులకు సమాచారం అందించాడు.

Also Read:లాక్ డౌన్ లో ఆశ్రయమిస్తే.. స్నేహితుడి భార్యపై కన్నేసి..

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సంతోష్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా.. నేరాన్ని అంగీకరించాడు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!