అందమే పెను శాపమా? అనుమానంతో భర్త దారుణం

Published : Sep 13, 2022, 05:14 AM IST
అందమే పెను శాపమా? అనుమానంతో భర్త దారుణం

సారాంశం

నిజామాబాద్‌లో జిల్లాలో అందంగా ఉన్న ఓ భర్త అందుకు ప్రతిఫలంగా తన ప్రాణాన్నే కోల్పోవాల్సి వచ్చింది. భార్యపై భర్త అనుమానం పెంచుకున్నాడు. తరుచూ వేధింపులకు దిగడంతో పిల్లలను వెంట బెట్టుకుని అమ్మ దగ్గర ఉంటున్నది. ఆమెను చూడటానికి వెళ్లి ఏకంగా చంపేసి వచ్చేశాడు.  

హైదరాబాద్: ఆ మహిళకు అందమే పెను శాపంగా మారింది. ఎవరితో మాట్లాడిన ఆమెను కట్టుకున్న భర్త మనుసులో కలకలం రేగేది. ఆమె పై అనుమనం విపరీతంగా పెంచుకుంటూ పోయాడు. కానీ, ఆ అనుమానం చివరకు తన భార్య ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బ్యాంక్ కాలనీలో చోటుచేసుకుంది. 

మాలపల్లికి చెందిన అనీస్ ఫాతిమాకు సయ్యద్ సుల్తాన్‌తో పెళ్లి జరిగింది. అనీస్ ఫాతిమా అందగత్తె. ఇదే ఆమె ప్రాణాలకు ఎసరు పెట్టినట్టు తెలుస్తున్నది. అందం కారణంగా ఆమెకు మరొకరితో సంబంధం ఉన్నట్టు ఆ భర్త అనుమానంతో చూసేవాడు. ఈ అనుమానం ఏకంగా ఆమెను కొట్టే వరకూ వెళ్లింది. ఆయన వేధింపులు భరించలేక ఆమె తమ ఇద్దరు పిల్లలను వెంట బెట్టుకుని బ్యాంక్ కాలనీలో నివసిస్తున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది.

ఏడాదిన్నర కాలంగా ఆమె భర్తకు దూరంగా అమ్మ దగ్గరే ఉంటున్నది. పిల్లలను చూడటానికి సయ్యద్ సుల్తాన్ వారి ఇంటికి వెళ్లి వస్తుండేవారు. ఇదే క్రమంలో శనివారం రాత్రి కూడా వారి ఇంటికి వెళ్లాడు. మళ్లీ వారి మధ్య గొడవ మొదలైంది. భార్యతో గొడవపడ్డాడు. అదే ఘర్షణలో ఆమె మెడకు చున్నీకి కట్టి ఊపిరాడకుండా చేసి మరణించేలా చేసినట్టు పోలీసులు తెలిపారు.

ఆమెను చంపేసి పిల్లలను తన వెంట తీసుకెళ్లాడని పోలీసులు తెలిపారు. తనపై కేసు పెట్టవద్దని, కేసు పెట్టకుంటేనే పిల్లలను వారికి అప్పజెప్పుతానని అన్నాడు. అనంతరం, ఆయన మొబైల్ ఫోన్ స్విచ్ఛాప్ చేశాడు. కేసు ఫైల్ అయిందని, దర్యాప్తు మొదలు పెట్టామని పోలీసులు వివరించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

JD Lakshmi Narayana : సీబీఐ మాజీ బాస్ ఇంటికే కన్నం.. రూ. 2.58 కోట్ల భారీ మోసం ! ఎలా బోల్తా కొట్టించారంటే?
Venkaiah Naidu Speech: వెంకయ్య నాయుడు పంచ్ లకి పడిపడి నవ్విన బ్రహ్మానందం| Asianet News Telugu