దీపావళి వేడుకల్లో అపశృతి.. చీరకు అంటుకున్న నిప్పు , భార్యను కాపాడే యత్నంలో భర్త మృతి

Siva Kodati |  
Published : Nov 12, 2023, 09:22 PM IST
దీపావళి వేడుకల్లో అపశృతి.. చీరకు అంటుకున్న నిప్పు , భార్యను కాపాడే యత్నంలో భర్త మృతి

సారాంశం

దీపావళి వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో అపశృతి చోటు చేసుకుంది. మల్కాజిగిరి వెంకటేశ్వర అపార్ట్‌మెంట్‌లో బాణాసంచా కాల్చుతుండగా భార్య చీరకు నిప్పు అంటుకుంది. ఇది గమనించిన భర్త ఆమెను కాపాడేయత్నంలో తాను బలయ్యాడు.

దీపావళి వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో అపశృతి చోటు చేసుకుంది. మల్కాజిగిరి వెంకటేశ్వర అపార్ట్‌మెంట్‌లో బాణాసంచా కాల్చుతుండగా భార్య చీరకు నిప్పు అంటుకుంది. ఇది గమనించిన భర్త ఆమెను కాపాడేయత్నంలో తాను బలయ్యాడు. భార్యకు సైతం తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు స్థానికులు. మరో ఘటనలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అవిడిలోనూ ఇదే తరహా ప్రమాదం జరిగింది. టపాసులు కాలుస్తుండగా మంటల్లో చిక్కుకుని దంపతులు మరణించారు. మరొకరి పరిస్ధితి విషమంగా వుంది. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ