తన భార్య తనకు విడాకులు ఇవ్వకుండా, తనకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకుందని ఓ భర్త పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
హైదరాబాద్ : భార్యకు తెలియకుండా భర్త రెండో పెళ్లి చేసుకోవడం మామూలుగా చూస్తుంటాం. తరువాత ఇప్పటికే ఓ విషయం తెలిసి భార్య పంచాయతీ పెట్టడం, పోలీస్ కేసులు… ఆ తరువాత రాజీలు.. లేకపోతే భర్త చేసిన మోసం తెలిసిన భార్య విడాకులు ఇవ్వడం.. కోర్టుకెక్కి సతాయించడం.. అక్కడక్కడ చూస్తుంటాం ..అయితే.. ఈ కేసు దానికి రివర్స్.. భర్తకు తెలియకుండా భార్య రెండో వివాహం చేసుకుంది.. దీంతో ఆ భర్త పోలీసులను ఆశ్రయించాడు. హైదరాబాదులో వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే…
విడాకులు ఇవ్వకుండానే తన భార్య రెండో పెళ్లి చేసుకుందని ఓ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బంజారా హిల్స్ పోలీసులు ఈ కేసు గురించి ఇలా చెబుతున్నారు.. ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ చూద్దాం కు 2013లో బేగంతో పెద్దల సమక్షంలో వివాహం అయింది. ఆమె రెండు వేల పదిహేడు లో మొయినుద్దీన్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, ముస్లిం చట్టం ప్రకారం… ఖులా (విడాకులు) ఇవ్వకుండానే ఆమె మరొకరిని వివాహం చేసుకుందని అతను ఫిర్యాదులో పేర్కొన్నాడు.
undefined
మనుమరాలి వరుసయ్యే బాలికపై అత్యాచారం.. వృద్ధుడికి 20 ఏళ్ల జైలు, నంద్యాల కోర్ట్ సంచలన తీర్పు
రుబీనా బేగం వేధింపుల కింద తన మీద తప్పుడు కేసు పెట్టినట్లు పేర్కొన్నాడు. అంతేకాకుండా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, ఈ నేపథ్యంలోనే తాను లైంగిక సామర్థ్య పరీక్షలు చేయించుకుని ధృవపత్రం తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. భార్యతో పాటు ఆమె తల్లి, సోదరుడు తనపై పలుమార్లు దాడికి పాల్పడ్డారని వారి నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో ఆరోపించాడు. పోలీసులు రుబీనా బేగం, ఆమె తల్లి ముంతాజ్ బేగం లతోపాటు కుటుంబ సభ్యులైన హైదర్ అలీ, యూసుఫ్ పాషా, మహమ్మద్ ఖాసిం, ముబీనుద్దీన్ లపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.