తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన కేబినెట్ భేటీ (telangana cabinet meeting) ముగిసింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన కేబినెట్ భేటీ (telangana cabinet meeting) ముగిసింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
కేబినెట్ నిర్ణయాలివే:
ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల ఆసరా పెన్షన్లు మంజూరు .
ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్షన్లకు అదనంగా కొత్తగా 10 లక్షల పెన్షన్లు ఇవ్వనున్నారు. దీంతో తెలంగాణలో మొత్తం పెన్షన్‌దారుల సంఖ్య 46 లక్షలకు చేరుకోనుంది.
స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన 75 మంది ఖైదీల విడుదలకు కేబినెట్ ఆమోదం.
కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రికి 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల మంజూరుకు నిర్ణయం
సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో అధునాతన సౌకర్యాలతో కూడిన భవన సముదాయం నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
ఖాళీగా వున్న 5,111 అంగన్‌వాడీ టీచర్లు, ఆయా పోస్టుల భర్తీకి నిర్ణయం
జీవో 58, 59 కింద పేదలకు పట్టాల పంపిణీ వేగవంతం
వికారాబాద్‌లో ఆటోనగర్ నిర్మాణానికి 15 ఎకరాలు మంజూరు