దారుణం.. భార్యను పంట కాలువలో పడేసి.. కాలుతో తొక్కి ప్రాణం తీసిన భర్త..

Published : Feb 02, 2022, 09:44 AM IST
దారుణం.. భార్యను పంట కాలువలో పడేసి.. కాలుతో తొక్కి ప్రాణం తీసిన భర్త..

సారాంశం

మంగళవారం ఉదయం గణపవరంలో ఉన్న పొలం వద్దకు పని ఉందని చెప్పి తీసుకెళ్లిన కొండలు పక్కనున్న పంట కాలువలో అంజమ్మను పడేసి  గొంతును కాలితో తొక్కుతూ ఊపిరాడకుండా చేశాడు. దీంతో అంజమ్మ ప్రాణాలు విడిచింది. గమనించిన చుట్టుపక్కల రైతులు పోలీసులకు సమాచారం అందించారు. 

కోదాడ : కోదాడలో దారుణం జరిగింది. అనుమానం పెనుభూతంగా మారి కట్టుకున్న భార్యను కడతేర్చిన ఘటన Kodadaమండలం గణపవరం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై సాయి ప్రశాంతి తెలిపిన వివరాల ప్రకారం…  గ్రామానికి చెందిన కాటబోయిన కొండలు, అంజమ్మ wife and husband. వీరికి 18 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. కొంత కాలంగా వీరి కుటుంబంలో Conflictలు చోటు చేసుకున్నాయి. తన భార్య అంజమ్మఎవరితోనో Illicit relationshipపెట్టుకుందన్న అనుమానం పెంచుకున్న కొండలు తరచూ మద్యం తాగి వచ్చి, భార్యను కొడుతూ.. శారీరకంగా, మానసికంగా వేధించేవాడు.

మంగళవారం ఉదయం గణపవరంలో ఉన్న పొలం వద్దకు పని ఉందని చెప్పి తీసుకెళ్లిన కొండలు పక్కనున్న పంట కాలువలో అంజమ్మను పడేసి  గొంతును కాలితో తొక్కుతూ ఊపిరాడకుండా చేశాడు. దీంతో అంజమ్మ ప్రాణాలు విడిచింది. గమనించిన చుట్టుపక్కల రైతులు పోలీసులకు సమాచారం అందించారు. నరసింహారావు, గ్రామీణ ఎస్సై సాయి ప్రశాంత్  ఘటనాస్థలిని పరిశీలించి, మృతదేహాన్ని కోదాడలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా, ఓ భార్య ప్రియుడి మోజులో husbandను హతమార్చిన వైనం పోలీసుల దర్యాప్తులో మంగళవారం వెలుగుచూసింది.  ఘటనకు సంబంధించి ప్రియుడితో పాటు మహిళనూ పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. అనంతపురం రూరల్ సిఐ మురళీధర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు..  ఆలమూరు గ్రామానికి చెందిన చియ్యేడు రవీంద్ర (40), బోయ విజయలక్ష్మి దంపతులు. తొమ్మిదేళ్ల క్రితం వివాహమైన వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.  కొంత కాలంగా తమ సమీప బంధువు  చియ్యేడు  సందీప్ తో  విజయలక్ష్మి extra marital affair కొనసాగిస్తూ వస్తోంది.

ఈ క్రమంలో తరచూ కలుసుకునేందుకు భర్త రవీంద్ర అడ్డు వస్తుండడంతో ఎలాగైనా అంతమొందించాలని భావించారు. పథకం ప్రకారం ఈ నెల 3న అర్ధరాత్రి తలదిండుతో ravindraకు ఊపిరాడకుండా చేసి murder చేశారు. ఆ తర్వాత snake byteతో మృతి చెందినట్లుగా నమ్మించారు. అయితే రవీంద్ర ఊపిరి అందకపోవడంతో చనిపోయాడని, శరీరంపై గాయాలు ఉన్నట్లు పోస్ట్మార్టం నివేదిక స్పష్టం చేసింది. దీంతో పోలీసులు కూపీ లాగడంతో అసలు విషయం వెలుగు చూసింది. విజయలక్ష్మి, సందీప్ ను అరెస్టు చేసి న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆదివారం రిమాండ్కు తరలించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu