
గవర్నర్ ప్రసంగం లేకుండా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ (Tamilisai Soundararajan) స్పందించారు. ఇది కొత్త సెషన్ కాదని.. అంతకుముందు జరిగిన సెషన్‌కు కొనసాగింపని ప్రభుత్వం చెబుతోందని ఆమె అన్నారు. గవర్నర్ ప్రసంగంతో సభ ప్రారంభించడం సాధ్యం కాదని ప్రభుత్వం పేర్కొందని తమిళిసై వ్యాఖ్యానించారు. సాంకేతిక కారణాలతో గవర్నర్ ప్రసంగాన్ని రద్దు చేశారని తమిళిసై తెలిపారు. 5 నెలల తర్వాత సభ సమావేశమవుతోందని.. గవర్నర్ ప్రసంగంతో సభ ప్రారంభం సాధ్యం కాదని ప్రభుత్వం వెల్లడించిందని ఆమె చెప్పారు.
ప్రభుత్వం నిర్ణయం రాజ్యాంగ హక్కులకు భంగమని.. తనకు ప్రజా సంక్షేమమే ముఖ్యమంత్రి తమిళిసై స్పష్టం చేశారు. గవర్నర్‌కు కొన్ని అధికారులున్నా.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అనుమతిచ్చానని ఆమె అన్నారు. గవర్నర్ ప్రసంగం లేకపోవడం వల్ల.. గతేడాది ప్రభుత్వ తీరుపై చర్చించే అవకాశాన్ని కోల్పోతున్నారని తమిళిసై తెలిపారు. గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయని తొలుత చెప్పారని.. ఇప్పుడు అనుకోకుండా తప్పు రాశామని చెబుతున్నారని ఆమె అన్నారు. కొనసాగింపు అని ప్రభుత్వం అంటోందని తమిళిసై వెల్లడించారు.
ఇకపోతే.. టెక్నికల్ కారణాలతోనే ఈ దఫా బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే. Telangana Assembly Budget సమావేశాలు హుందాగా నిర్వహిస్తామన్నారు. 2021 లో 8వ అసెంబ్లీ సమావేశాలు జరిగాయన్నారు. అయితే ఈ సమావేశాలు జరిగిన తర్వాత అసెంబ్లీ ప్రోరోగ్ కాలేదని ఆయన గుర్తు చేశారు. ఈ నెల 7వ తేదీ నుండి జరిగే సమావేశాలు 8వ సమావేశాలకు కొనసాగింపు మాత్రమేనని మంత్రి వివరించారు.
Telangana వృద్ది రేటు దేశంలోనే నెంబర్ వన్ గా ఉందని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలు చెబుతున్నాయని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్దిలో ముందుకు సాగుతుంటే BJP నేతలు మాత్రం రాష్ట్రంలో అభివృద్ది లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఆయన పేర్కొన్నారు. తాము చేసిన అభివృద్దిని గవర్నర్ ద్వారా చెప్పించాలని కోరుకొంటామన్నారు. కానీ టెక్నికల్ సమస్యలతో ఈ దఫా గవర్నర్ ప్రసంగం లేదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. అసెంబ్లీ ప్రోరోగ్ కాకపోవడం వల్లే ఈ దఫా బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉండదని మంత్రి వివరించారు.
అయితే ప్రతి బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రారంభించాలనే నియమం లేదన్నారు. ప్రతి క్యాలెండర్ ఇయర్ లో కొత్త సెషన్స్ మాత్రమే Governor ప్రారంభించాలనేది నిబంధన అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. ఈ నెల 7వ తేదీ నుండి జరిగే బడ్జెట్ సమావేశాలు ఈ ఏడాదిలో జరిగే కొత్త సమావేశాలు కావని మంత్రి తేల్చి చెప్పారు. ఈ కారణంగానే గవర్నర్ ప్రసంగం ఉందని ఆయన వివరించారు. అసెంబ్లీ సమావేశాలు Prorogue కాకపోవడం వల్లే గవర్నర్ ప్రసంగం లేదని చెప్పారు. ఒకవేళ ప్రోరోగ్ కాని సమావేశాలకు గవర్నర్ ప్రసంగం ఉంటే అదే రాజ్యాంగబద్దంగా తప్పు అవుతుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.