ఫిబ్రవరిలో మేడారం చిన్న జాతర : ఏ రోజు ఏం చేస్తారంటే..?

By Siva KodatiFirst Published Jan 17, 2021, 5:18 PM IST
Highlights

ఫిబ్రవరిలో జరగనున్న మేడారం చిన్న జాతర (మండ మెలిగే పండగ) తేదీలను ఆలయ పూజారులు ప్రకటించారు. ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు చిన్న జాతరను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఫిబ్రవరిలో జరగనున్న మేడారం చిన్న జాతర (మండ మెలిగే పండగ) తేదీలను ఆలయ పూజారులు ప్రకటించారు. ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు చిన్న జాతరను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నాలుగు రోజుల పాటు జరిగే జాతరలో భాగంగా నిత్యం పూజా కార్యక్రమాల వివరాలను అర్చక స్వాములు మీడియాకు వివరించారు.

జాతరలో మొదటి రోజైన 24న సమ్మక్క-సారలమ్మ అమ్మవార్ల ఆలయాన్ని శుద్ధి చేయడంతో పాటు గ్రామ ద్వార స్తంభాలను స్థాపించనున్నారు. 25న అమ్మవార్లకు పసుపు, కుంకుమతో అర్చన చేయనున్నారు.

26న భక్తులను అమ్మవారిని దర్శనానికి అనుమతిస్తామని ప్రకటించారు. సమ్మక్క-సారలమ్మలకు ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం 27వ తేదీన జాతర ముగియనుంది.
 

click me!