తెలంగాణలో మద్యం షాపులకు టెండర్లకు భారీ రెస్పాన్స్.. 3 రోజుల్లోనే 2 వేల దరఖాస్తులు, ఈసారి కాసుల పంటే

Siva Kodati |  
Published : Aug 11, 2023, 05:10 PM IST
తెలంగాణలో మద్యం షాపులకు టెండర్లకు భారీ రెస్పాన్స్.. 3 రోజుల్లోనే 2 వేల దరఖాస్తులు, ఈసారి కాసుల పంటే

సారాంశం

తెలంగాణలో మద్యం షాపుల టెండర్లకు అనూహ్య రెస్పాన్స్ వస్తోందని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 18న సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు విధించారు. ఈ నెల 21న లాటరీ ద్వారా మద్యం షాపులు కేటాయించనున్నారు. 

తెలంగాణలో మద్యం షాపుల టెండర్లకు అనూహ్య రెస్పాన్స్ వస్తోందని అధికారులు చెబుతున్నారు. షాపులను దక్కించుకునేందుకు పలువురు బడా బాబాబు రంగంలోకి దిగడంతో ప్రభుత్వానికి దరఖాస్తులు, ఇతర రుసుముల రూపంలో భారీగా ఆదాయం వస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే 2 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని అబ్కారీ శాఖ చెబుతోంది. దరఖాస్తు ఫీజు కింద రూ.2 లక్షలు వసూలు చేస్తున్న వ్యాపారులు వెనక్కి తగ్గడం లేదు. గత నోటిఫికేషన్ సందర్భంగా ప్రభుత్వానికి రూ.1,350 కోట్ల ఆదాయం సమకూరిందని.. ఈసారి దీనికి మించిన స్థాయిలో ఆదాయం వస్తుందని అంచనా. 

అన్ని జిల్లాల్లోనూ రెస్పాన్స్ బాగానే వున్నప్పటికీ.. ముఖ్యంగా కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌లో మద్యం షాపుల టెండర్లకు చాలామంది పోటీపడుతున్నారని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 2,620 మద్యం షాపులు వుండగా.. ఇప్పటికే 2 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. రాబోయే రోజుల్లో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం వుందని తెలుస్తోంది. ఈ నెల 18న సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు విధించారు. ఈ నెల 21న లాటరీ ద్వారా మద్యం షాపులు కేటాయించనున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
CM Revanth Reddy Interview: ఇంగ్లీష్ లో ఇంటర్వ్యూ అదరగొట్టిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet Telugu