
ఈసారి ముందస్తు ఎన్నికలకు ( early elections) వెళ్లే ఆలోచన లేదంటూ తెలంగాణ సీఎం (telangana cm) కేసీఆర్ (kcr) చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు బీజేపీ (bjp) నేత విజయశాంతి (vijaysanthi). ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడరని.. సమయం , సందర్భం లేకుండా ముందస్తు ఎన్నికలు లేవని చెప్పారంటూ దుయ్యబట్టారు. దీనిని చూస్తుంటే కేసీఆర్‌కు పక్కా ముందస్తు ప్లాన్ వుండే వుంటుందని విజయశాంతి ఆరోపించారు. ప్రతిపక్షాలు (oppostion parties) ముందస్తు ఎన్నికలకు సిద్ధం అవ్వడం మంచిదని రాములమ్మ హితవు పలికారు.
అంతకుముందు ఆదివారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ నెల 26, 27 తేదీలలో హుజురాబాద్‌లో జరిగే ఎన్నికల సభలో పాల్గొంటానని తెలిపారు. టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల నిర్వహణతో పాటు, పార్టీ ప్లీనరీ భవిష్యత్తులో నిర్వహించాల్సిన అంశాలపై పార్టీ ప్రజా ప్రతినిధులతో సీఎం కేసీఆర్ చర్చించారు. ఈ సారి తాను ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని సీఎం శ్రేణులకు తెలిపారు. మనం చేయాల్సిన పనులు ఇంకా చాలా వున్నాయని.. ఇంకా రెండేళ్లు వుందని అన్ని పనులు మనమే చేసుకుందామని కేసీఆర్ చెప్పారు.
Also Read:Huzurabad bypoll: బరిలో 27 మంది ఇండిపెండెంట్లు... కమలం, కారును పోలిన గుర్తులు, ఎవరి కొంపముంచుతారో?
వచ్చే నెల 15న తెలంగాణ విజయ గర్జన పేరుతో వరంగల్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాలపై సీఎం కేసీఆర్ పార్టీ ప్రజా ప్రతినిధులకు దిశానిర్ధేశం చేశారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే అంశంపై కూడా గులాబీ బాస్ పలు సూచనలు చేశారు. 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రత్యర్ధులు తమకు సవాల్ విసరడానికి కూడా అందనంత ఎత్తులో పార్టీ బలంగా ఉండాలని కేసీఆర్ శ్రేణులకు తెలిపారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు సీఎం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా పార్టీ కోసం పనిచేసే వారికే పదవులు కట్టబెట్టారు. మరో వైపు పార్టీ కోసం పనిచేసిన వారికే త్వరలో నామినేటేడ్ పదవులు ఇవ్వనున్నారు. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా వార్డు, గ్రామ, మండల కమిటీ అధ్యక్షుల ఎన్నిక పూర్తైంది. రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కోసం ఇవాళే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.