హైదరాబాద్ హబ్సీగూడాలో భారీ అగ్ని ప్రమాదం.. అత్తాపూర్ లో మరో ఘటన..

Published : Aug 02, 2023, 09:12 AM IST
హైదరాబాద్ హబ్సీగూడాలో భారీ అగ్ని ప్రమాదం.. అత్తాపూర్ లో మరో ఘటన..

సారాంశం

హైదరాబాద్ హబ్సీగూడాలోని అన్ లిమిటెడ్ షోంరూంలో మంటలు చెలరేగాయి. మరోవైపు అత్తాపూర్ హసన్ నగర్ లోని బట్టల గోదాంలోనూ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 

హైదరాబాద్ : హైదరాబాద్ లో బుధవారం తెల్లవారుజామున రెండు అగ్నిప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. హబ్సీగూడాలో, అత్తాపూర్ లో జరిగిన ఈ అగ్ని ప్రమాదాల్లో మంటలు తీవ్ర స్థాయిలో ఎగిసిపడుతున్నాయి. 

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో మరో అగ్ని ప్రమాదం కలకలం సృష్టించింది. హబ్సిగూడలోని అన్ లిమిటెడ్ షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత మంటలు చెలరేగాయి. అన్లిమిటెడ్ షోరూంలో మంటలు ఎగిసిపడుతన్నాయి. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది. ఉప్పల్ - సికింద్రాబాద్ ప్రధాన రహదారి కావడంతో పొగతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఘటనా స్థలం పక్కనే పెట్రోల్ బంక్ ఉండడంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. 

మరోవైపు హైదరాబాద్ అత్తాపూర్ హసన్ నగర్ లో కూడా భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ బట్టల గోదాంలో మంటలు చెలరేగాయి. దీంతో  దట్టమైన పొగ వ్యాప్తితో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రెండు ఫ్లోర్లలో వ్యాపించిన మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పుతున్నారు. మంటలు మరింత వ్యాపించకుండా అధికారుల చర్యలు చేపట్టారు. సమీప ఇళ్లకు మంటలు వ్యాపించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Journalists Arrest : జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు ఏమిటీ వివాదం..?
Telangana Rains : తెలంగాణలో వర్షాలు.. సంక్రాంతి పండగవేళ వాతావరణం ఎలా ఉంటుందంటే...