Telangana Elections 2023: మీ ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో వుందో ఇలా తెలుసుకోండి..

By Mahesh RajamoniFirst Published Nov 27, 2023, 1:52 PM IST
Highlights

Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. ప్రధాన రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నాయి. ఈ నెల 30 పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.
 

Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నేడు ఎన్నికల ప్రచారం ముగియనుంది. రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ల మధ్య త్రిముఖ పోరు కొనసాగుతోంది. పోలింగ్ కు మ‌రో మూడు రోజులు మాత్ర‌మే మిగిలివుంది. ఈ క్ర‌మంలోనే ఎన్నిక‌ల సంఘం (ఈసీ) అధికారులు ఓటువేయ‌డం, గుర్తింపు కార్డుల‌ను వెంట తీసుకురావ‌డం వంటి ప‌లు అంశాల‌కు సంబంధించి ఓట‌ర్ల‌కు ప‌లు కీల‌క సూచ‌న‌లు చేస్తున్నారు.

ఎన్నిక‌ల సంఘం సూచ‌న‌లు.. 

Latest Videos

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఓటర్లు తమ పోలింగ్ స్టేషన్ వివరాలను ఓటింగ్ రోజు ముందు తెలుసుకోవ‌డం కీల‌క‌మ‌ని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఓటు వేయ‌డానికి కేవ‌లం ఒక్క ఓటరు ఐడీ కార్డు మాత్ర‌మే స‌రిపోద‌నీ, దానితో పాటు ఆ వ్య‌క్తికి  సంబంధించిన పూర్తి చిరునామాతో ఉన్న మ‌రో గుర్తింపు కార్డు అవ‌స‌ర‌మ‌ని ఎన్నిక‌ల సంఘం అధికారులు తెలిపారు. ఓటు వేయ‌డానికి వ‌చ్చే వారు త‌ప్పనిసరిగా వారి చిరునామా ఆధారంగా నిర్ణీత పోలింగ్ స్టేషన్‌ను చేరుకోవాల‌ని సూచిస్తున్నారు.

మీ ఓటు వేసే పోలింగ్ కేంద్రం ఎలా తెలుసుకోవాలి..? 

మీరు ఓటువేయ‌డానికి సంబందించిన పోలింగ్ స్టేష‌న్ వివ‌రాల‌ను తెలుసుకోవ‌డానికి సంబంధిత అధికారులు సంప్ర‌దించ‌డం లేదా ఆన్ లైన్ లో ఎన్నిక‌ల క‌మిష‌న్ వెబ్ సైట్ ను సంద‌ర్శించ‌డం ద్వారా తెలుసుకోవ‌చ్చు. దాని కోసం ఈ కింది విధంగా వెబ్ సైట్ లో మీ పోలింగ్ కేంద్రం వివ‌రాలు తెలుసుకోండి.. 

  • మొద‌ట “జాతీయ ఓటర్ల సేవల పోర్టల్” (National Voters’ Services Portal) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. డైరెక్ట్ లింక్ కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి. >>ఓట‌ర్స్ స‌ర్వీస్ పోర్ట‌ల్  
  • మీకు ఒక పేజీ ఒపెన్ అవుతుంది. త‌ర్వాత ఆ పేజీలో క‌నిపించే పేరు, తండ్రి పేరు, వయస్సు, లింగం, రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం వంటి వివరాలను పూరించండి.
  • ఆ త‌ర్వాత చివ‌ర‌లో కాప్చ కోడ్ ఎంట‌ర్ చేయండి. ఇప్పుడు ప‌క్క‌నే ఉన్న సెర్చ్ బ‌ట‌న్ ను క్లిక్ చేయండి. 
  • 'సెర్చ్' బటన్‌ను క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్‌పై కనిపించే వివరాలతో తెలంగాణ ఎన్నికల పోలింగ్ స్టేషన్‌ల వివ‌రాలు మీకు క‌నిపిస్తాయి. 
  • ఈ వివరాల్లో పోలింగ్ స్టేషన్ చిరునామా మాత్రమే కాకుండా పార్ట్ సీరియల్ నంబర్ కూడా ఉంటుంది.

ఓటు వేయ‌డానికి ఓట‌రు కార్డుతో పాటు ఈ ప‌త్రాలు తీసుకెళ్లాలి.. 

తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓట‌రు కార్డుతో పాటు అవసరమైన పత్రాలు గురించి ఎన్నిక‌ల సంఘం పేర్కొంది. ఎన్నికలలో ఓటు వేయడానికి, ఓటరు కార్డుతో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి. ఉదాహార‌ణ‌కు ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, రేష‌న్ కార్డులు మొద‌లైన‌వి. తెలంగాణ ఎన్నికల పోలింగ్ కేంద్రంలోకి ఓటర్లు సెల్‌ఫోన్లు, ఇయర్‌ఫోన్‌లు, కెమెరాలు, స్మార్ట్‌వాచ్‌లు మొదలైనవాటిని తీసుకెళ్లడం నిషేధించబడిందని ఎన్నిక‌ల సంఘం అధికారులు తెలిపారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న జ‌ర‌గ‌నుండ‌గా, డిసెంబర్ 3న కౌంటింగ్ జరగనుంది.

click me!