కొడంగల్ రేవంత్ కు పెద్దమ్మ తల్లి సెంటిమెంట్

First Published Dec 9, 2017, 5:45 PM IST
Highlights
  • కాంగ్రెస్ లో చేరిననాడు అమ్మవారికి పూజలు
  • మల్లన్న సాగర్ దీక్షకు వెళ్లినప్పుడు కూడా
  • గాంధీభవన్ లో కాలు పెట్టేముందు పెద్దమ్మ తల్లికి మొక్కులు

రేవంత్ రెడ్డి పుట్టింది.. పెరిగింది.. కొండారెడ్డి పల్లెలో. ఆయన సొంతూరు అచ్చంపేట నియోజకవర్గంలో ఉంటది. ఆయనకు రాజకీయంగా నీడనిచ్చింది కొడంగల్ నియోజకవర్గం. కానీ ఆయన హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ లో కొలువైన పెద్దమ్మ తల్లి భక్తుడు. రేవంత్ రెడ్డి దశాబ్ద కలంగా ఏ శుభ కార్యం చేసినా.. పెద్దమ్మ తల్లి ఆశిస్సులు తీసుకున్న తర్వాతే మొదలు పెడతారట.

గత ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి ప్రతి సందర్భంలోనూ పెద్దమ్మ తల్లి ఆశిస్సులు తీసుకున్న తర్వాతే ఆయన కార్యక్రమాలు మొదలు పెట్టారని రేవంత్ అనుచరుడొకరు తెలిపారు. తెలంగాణ సర్కారు భూనిర్వాసితులకు పరిహారం విషయంలో సతాయిస్తుందని ఆరోపిస్తూ మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసిత రైతులకు మద్దతుగా మెదక్ జిల్లాలో రెండురోజులపాటు దీక్ష చేశారు రేవంత్ రెడ్డి. ఆ సమయంలో పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాతే అక్కడికి వెళ్లారు.

తెలుగుదేశం పార్టీలోని తెలంగాణ పార్టీ కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఒక ఫ్లోర్ మొత్తం ఇచ్చారు. దాన్ని రెనెవేషన్ చేసి రేవంత్ రెడ్డి ఆఫీసు ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో కూడా పెద్దమ్మ తల్లికి మొక్కి ఆఫీసు ఓపెనింగ్ లో పాల్గొన్నారు. పెద్దమ్మ గుడి కానుంచి సైకిల్ మీద బయలుదేరి పార్టీ ఆఫీసుకు వెళ్లిండు.

ఇక టిడిపిని వీడిన తర్వాత  కాంగ్రెస్ లో చేరే సమయంలోనూ పెద్దమ్మ తల్లికి మొక్కిన తర్వాతే హైదరాబాద్ నుంచి కదిలిండు రేవంత్. ఆరోజు ఉదయం అమ్మవారి గుడిలో పూజలు చేసిన తర్వాత తన ఇంటి వద్ద భారీ సభ ఏర్పాటు చేశారు. ఆ సభ అయిపోయిన తర్వాత ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండవా కప్పుకున్నారు.

తాజాగా గాంధీభవన్ లో అడుగు పెట్టేందుకు సైతం భారీ కాన్వాయ్ తో పెద్దమ్మ అమ్మవారికి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి గాంధీభవన్ బయలుదేరిండు రేవంత్.

అయితే రేవంత్ ఫ్యామిలీకి అమ్మవారి సెంటిమెంట్ ఉందట. పెద్దమ్మ, ముత్యాలమ్మ, మైసమ్మ, మాంకాలమ్మ ఇలా అమ్మవార్లను కొలుస్తారని కొండంగల్ కు చెందిన రేవంత్ సన్నిహితుడు ఏషియానెట్ కు వెల్లడించారు. అందుకే హైదరాబాద్ లో పెద్దమ్మ తల్లికి ముక్కుతాడని తెలిపారు.

click me!