Honor Killing : వేరే కులం వ్యక్తిని ప్రేమించిందని.. కన్నకూతురి ఛాతిమీద కూర్చుని, గొంతునులిమి...

By SumaBala BukkaFirst Published Dec 4, 2021, 11:43 AM IST
Highlights

వరంగల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తమ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తప్పుదోవ పట్టించారు. ఆ తరువాత పదిహేను రోజులపాటు నెట్టుకొచ్చిన నిందితులు.. తాము చేసిన ఘోరం బయటపడక తప్పదనే నిర్ధారణకు వచ్చి తమంతట తాముగానే నేరం ఒప్పుకున్నారు. 

హనుమకొండ : పదిహేడేళ్ల బాలిక  నిద్రిస్తుండగా కన్నతల్లి ఆమె ఛాతీ మీద కూర్చుని గొంతు నులిమింది.  అమ్మమ్మనేమో ఆ బాలిక ముఖంపై దిండుని గట్టిగా అదిమి పట్టింది. పేగుబంధం అనే కనికరం కూడా లేకుండా ఇద్దరూ కలిసి బాలికను దారుణంగా murder చేశారు.  తాము తగదని చెబుతున్న వేరే కులం అబ్బాయితో బాలిక love affair పేరుతో చనువుగా ఉంటుందని.. ఆ కారణంగా ఊర్లో తమ పరువు పోతుందనే ఆగ్రహంతో వారు ఇంతటి దారుణానికి ఒడిగట్టారు. 

వరంగల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తమ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తప్పుదోవ పట్టించారు. ఆ తరువాత పదిహేను రోజులపాటు నెట్టుకొచ్చిన నిందితులు.. తాము చేసిన ఘోరం బయటపడక తప్పదనే నిర్ధారణకు వచ్చి తమంతట తాముగానే నేరం ఒప్పుకున్నారు. 

ఈ కేసు వివరాలను శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఈస్ట్జోన్ డిసిపి వెంకటలక్ష్మి వివరించారు. పర్వతగిరి మండల కేంద్రంలో ఉంటున్న SC (మాల) వర్గానికి చెందిన ఉబ్బని సమ్మక్కకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె వివాహం కాగా మరో కుమార్తె అంజలి (17) పదో తరగతి చదువుతోంది. సమ్మక్క భర్త రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఇంట్లో సమ్మక్క, అంజలితోపాటు సమ్మక్క తల్లి యాకమ్మ ఉంటుంది.

అంజలికి అదే గ్రామస్థుడు, ఎస్టీ (ఎరుకల) కులానికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఇద్దరూ సన్నిహితంగా ఉండేవారు.  ఈ విషయం తెలిసి అంజలిని సమ్మక్క, యాదమ్మ మందలించారు. అయినా అంజలి వినిపించుకోలేదు. కూతురితో ప్రవర్తనతో వూర్లో తమ పరువు పోతుందని సమక్క భావించింది. యాకమ్మతో  కలిసి కూతురిని Honor Killing చేసేందుకు పథకం వేసింది. తొలుత ఇంట్లో ఉరివేసి చంపాలని అనుకున్నారు.

ఔటర్ పై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు.. మంటల్లో దగ్థం...

విషయం బయటకు తెలిస్తే దొరికిపోతామని విరమించుకున్నారు. నవంబర్ 19న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న అంజలినీ ఇద్దరూ కలిసి హత్య చేశారు. తెల్లవారే వరకు dead body పక్కనే నిద్రించారు. ఉదయం ఇద్దరూ ఇంట్లో నుంచి బయటకు వచ్చి అంజలి లెవ్వడంలేదని ఏడుపులు పెడబొబ్బలు మొదలుపెట్టారు.  రాత్రి గొడవ జరిగిందని, నిద్ర మాత్రలు వేసుకుంటానని  బెదిరించింది అని చెప్పారు.  దీంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే, మృతురాలి గొంతుపై గోళ్లు గీసుకుపోయినట్టుగా గాట్లు ఉండడం,  ముక్కు నుంచి రక్తం కారడంతో పోలీసులు అనుమానించారు. అయితే సమ్మక్క, యాకమ్మలను ప్రశ్నించకుండా పోస్టుమార్టం నివేదిక వచ్చే దాక వేచి చూశారు. పోస్టుమార్టం రిపోర్టులో అనుమానాస్పద మృతిగా  వచ్చింది. Forensic report తెప్పించుకునే పనిలో పోలీసులు ఉండగానే తాము పట్టుబడడం తప్పదని సమ్మక్క, యాకమ్మ అనుకున్నారు.

శుక్రవారం గ్రామపెద్దమనిషి వద్దకు వెళ్లి తమ బిడ్డను తామే చంపామని, తమను పోలీసుల వద్దకు తీసుకు వెళ్లాలని కోరారు. పెద్దమనుషుల సాయంతో ఇద్దరూ కలిసి పర్వతగిరి పోలీసులు ఎదుట లొంగిపోయారు. వారిని అరెస్టు చేసి, హత్యా నేరం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. 

click me!