హైద్రాబాద్‌కు చెందిన హోంగార్డు ఆశోక్ కరోనాతో మంగళవారం నాడు మరణించాడు. హైద్రాబాద్ కు డబీర్‌పురాకు చెందిన హోంగార్డు ఆశోక్ కు కరోనా సోకింది.
హైదరాబాద్: హైద్రాబాద్‌కు చెందిన హోంగార్డు ఆశోక్ కరోనాతో మంగళవారం నాడు మరణించాడు. హైద్రాబాద్ కు డబీర్‌పురాకు చెందిన హోంగార్డు ఆశోక్ కు కరోనా సోకింది.
కరోనా సోకిన ఆశోక్ ను కుటుంబసభ్యులు మలక్ పేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.ఈ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందాడు. ఇదే సమయంలో ఆసుపత్రిలో ఖర్చులు పెరిగిపోవడంతో గాంధీ ఆసుపత్రికి తరలించాలని కుటుంబసభ్యులు భావించారు. ఇవాళ ఉదయం గాంధీ ఆసుపత్రికి ఆశోక్ ను తరలించారు.
undefined
also read:కరోనా కలకలం: పేట్లబురుజు ఆసుపత్రిలో 32 మందికి కరోనా
గాంధీ ఆసుపత్రికి తరలించేలోపుగానే ఆయన మరణించారు. ఆసుపత్రి వైద్యులు ఆశోక్ ను పరీక్షించి మృతి చెందినట్టుగా ధృవీకరించారు.ఈ ఏడాది మే 21వ తేదీన పోలీస్ శాఖలో కరోనాతో తొలి మరణం నమోదైంది. కానిస్టేబుల్ యాదగిరిరెడ్డి కరోనాతో మరణించాడు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సోమవారం నాడు పేట్లబురుజు ఆసుపత్రిలో 32 మందికి కరోనా సోకింది. 14 మంది వైద్యులకు, 18 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. సోమవారం నాడు తెలంగాణ రాష్ట్రంలో 5,193 కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం నాడు కొత్తగా 219 కేసులు నమోదైనట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.