కరోనా కలకలం: పేట్లబురుజు ఆసుపత్రిలో 32 మందికి కరోనా

By narsimha lodeFirst Published Jun 15, 2020, 6:01 PM IST
Highlights


 హైద్రాబాద్ నగరంలోని పేట్ల బురుజు ఆసుపత్రిలో వైద్య సిబ్బందికి కరోనా సోకింది. 32 మందికి కరోనా సోకినట్టుగా అధికారులు ప్రకటించారు. 14 మంది వైద్యులు, 18 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకినట్టుగా అధికారులు నిర్ధారించారు.

హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలోని పేట్ల బురుజు ఆసుపత్రిలో వైద్య సిబ్బందికి కరోనా సోకింది. 32 మందికి కరోనా సోకినట్టుగా అధికారులు ప్రకటించారు. 14 మంది వైద్యులు, 18 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకినట్టుగా అధికారులు నిర్ధారించారు.

హైద్రాబాద్ పేట్లబురుజు ఆసుపత్రిలో ఇంత పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది.

also read:నిజామాబాద్‌జిల్లాలో మరో ఎమ్మెల్యేకి కరోనా: గణేష్ గుప్తాకి కోవిడ్

హైద్రాబాద్ లో  ఒకే ఆసుపత్రిలో ఇంత పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే  ప్రథమం.  తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 45 మంది వైద్యులకు కరోనా సోకింది. ఆయా కాలేజీల్లో పనిచేస్తున్న పీజీ విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో రెండు వారాల క్రితం సుమారు 600 మందిని క్వారంటైన్ కి తరలించారు.

తాజాగా పేట్లబురుజు ఆసుపత్రిలో పనిచేస్తున్న 14 మంది డాక్టర్లకు, 18 మంది వైద్య సిబ్బందికి కరోనా వచ్చినట్టుగా అధికారులు  గుర్తించారు. 

తెలంగాణలో ఆదివారం నాటికి 4974కి కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికి కరోనాతో మరణించిన వారి సంఖ్య 185కి చేరుకొన్నాయి. ప్రస్తుతం 2412 మంది కరోనా రోగులు పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

రాష్ట్రంలో ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్ గుప్తాకు కరోనా సోకింది. 
 

click me!