కోకాపేట్​ భూముల పేరుతో ప్రైవేటు ప్రకటనలు: పోలీసులకు హెచ్ఎండీఏ ఫిర్యాదు

By Siva Kodati  |  First Published Jun 26, 2021, 7:04 PM IST

హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్​ మెంట్​ అథారిటీ (హెచ్ఎండిఏ) ఆధ్వ‌ర్యంలో కోకాపేట్​ లే అవుట్‌లో భూముల​ ఈ‌‌‌‌ – ఆక్షన్ ప్రక్రియ కొనసాగుతున్న నేప‌థ్యంలో దీనిని సాకుగాచూపి అమాయక ప్రజలను మోసం చేస్తున్న సీఎన్ఎన్ వెంచ‌ర్స్ అనే సంస్థపై సెంట్రల్​ క్రైమ్​ స్టేషన్​ ( సీసీఎస్ ​) పోలీసులు ఎఫ్ఐఆర్​ నమోదు చేశారు.


హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్​ మెంట్​ అథారిటీ (హెచ్ఎండిఏ) ఆధ్వ‌ర్యంలో కోకాపేట్​ లే అవుట్‌లో భూముల​ ఈ‌‌‌‌ – ఆక్షన్ ప్రక్రియ కొనసాగుతున్న నేప‌థ్యంలో దీనిని సాకుగాచూపి అమాయక ప్రజలను మోసం చేస్తున్న సీఎన్ఎన్ వెంచ‌ర్స్ అనే సంస్థపై సెంట్రల్​ క్రైమ్​ స్టేషన్​ ( సీసీఎస్ ​) పోలీసులు ఎఫ్ఐఆర్​ నమోదు చేశారు.

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎంఎస్​టిసి లిమిటెడ్ ద్వారా జరుగుతున్న కోకాపేట్​ భూముల ఈ – ఆక్షన్​ ప్రక్రియ పూర్తికాకముందే ప్రజలను మభ్యపెట్టేవిధంగా సదరు సీఎన్ఎన్​ వెంచర్స్​ కొన్ని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి వంచనకు గురిచేస్తున్న తీరును హెచ్​ఎండిఏ తీవ్రంగా పరిగణించింది. కోకాపేట్​ భూములను మార్కెట్​ విలువలో 50 శాతం పెట్టుబడులతో, 1,500 చదరపు అడుగుల వరకు 3బిహెచ్​కె ఫ్లాట్​ లను సొంతం చేసుకోవచ్చని సీఎన్ఎన్​ వెంచర్స్​ త‌మ ప్రకటనల ద్వారా అమాయక ప్రజలను మోసం చేస్తున్న‌ది అని హెచ్ఎండీఏ పేర్కొన్న‌ది.

Latest Videos

Also Read:కొత్త జిల్లాల ప్రకారమే.. టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు: ఉపాధ్యాయ నేతలకు కేసీఆర్ హామీ

ఒకవైపు కోకాపేట్​ భూముల ఈ–ఆక్షన్​ ప్రక్రియ కొనసాగుతుండగా, తక్కువ ధరలకు/రేట్లకు పెట్టుబడులు పెట్టి 3బిహెచ్​కె ఫ్లాట్లను కొనుగోలు చేసుకోవచ్చని సామాన్య ప్రజానీకాన్ని ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ప్రజల నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న సీఎన్ఎన్​ వెంచర్స్ పై చర్యలు తీసుకోవాలని హెచ్ఎండీఏ సెక్రెటరీ, ఔటర్​ రింగ్​ రోడ్డు (ఓఆర్ఆర్)​ ప్రాజెక్టు డైరెక్టర్​ సంతోష్​ ఐఏఎస్​ శుక్రవారం నగర పోలీస్​ కమిషనర్​ కు ఫిర్యాదు చేశారు.

హెచ్ఎండీఏ భూముల వేలం పూర్తికాకముందే, నిర్ణిష్టమైన అనుమతులు లేకుండానే అమాయక ప్రజలను మోసం చేసే విధంగా వ్యవహరిస్తున్న సీఎన్ఎన్​ వెంచర్స్‌‌పై కఠిన చర్యలు తీసుకుని హెచ్ఎండీఏ ప్రతిష్టతను కాపాడాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి వ్యాపార ప్రకటనలను, లావాదేవీలను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రజలు విశ్వసించరాదని హెచ్ఎండీఏ సూచించింది.
 

click me!