వెరైటీ వినాయకులు వచ్చేస్తున్నారోచ్

First Published Jun 27, 2017, 12:52 PM IST
Highlights

వినాయక చవితి రాబోతున్నది. హైదరాబాద్  లో వినాయక చవితి ఒక రేంజ్ లో జరుగుతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా వెరైటీ గణపయ్యలు కొలువుదీరబోతున్నారు. బాహుబలి గణేష్, రోబో గణేష్, గబ్బర్ సింగ్ గణేష్, శ్రీమంతుడు గణేష్ ఇలా రక రకాల గణేషులు దర్శనమివ్వబోతున్నారు. గణపయ్య ఆకారాలు మార్చడం పట్ల భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

వినాయక చవితి రాబోతున్నది. హైదరాబాద్  లో వినాయక చవితి ఒక రేంజ్ లో జరుగుతుంది. దేశం దృష్టిని ఆకర్షించేలా గణేష్ ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి. అయితే గణేషుడు అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది ఆయన నిండైన పొట్ట. గణేషుడు ఎంత నిండైన పొట్టతో ఉంటే అంత గొప్ప విగ్రహం తయారు చేసినట్లు ఇంతకాలం భావిస్తూ వచ్చారు.

 

కానీ రోజులు మారినట్లు గణపయ్య ఆకారాల్లోనూ మార్పులు చేర్పులు చేస్తున్నారు విగ్రహ తయారీదారులు. గత పదేళ్ల కాలంలో ఈ మార్పులు గణనీయంగా చోటు చేసుకుంటున్నాయి. తొలిసారిగా 6 ప్యాక్, 8 ప్యాక్ గణేషులు కొలువుదీరి అందరినీ ఆకర్షించారు. భారీ పొట్టతో నిండుగా ఉండే గణపయ్య స్థానంలో కండలు  పెరిగి పొట్ట లోపలికి వెళ్లి 6ప్యాక్, 8ప్యాక్ లో చూడడం కొందరికి ఇష్టం ఉన్నా మరికొందరు భక్తులు మాత్రం సహించలేకపోతున్నారు.

 

 

ఈసారి గణేష్ ఉత్సవాలకు సరికొత్త రీతిలో విగ్రహాల తయారీకి పూనుకున్నారు తయారీదారులు. అందులో బాహుబలి గణేష్ , రోబో  గణేష్, గబ్బర్ సింగ్ గణేష్ లను కూడా తయారు చేస్తున్నారు. మీలో ఎవరు కోటీశ్వరులు నమూనాలో గణేషుల తయారీ చేస్తున్నారు. శ్రీమంతుడు గణేష్, గబ్బర్ సింగ్ గణేష్ లను సైతం తయారు చేస్తున్నారు. వి గ్రహ తయారీదారులు ఇలా వెకిలిగా అశ్రధ్ధతో అడ్డగోలు ఆకారాల్లో చేస్తున్నందుకే గణపతి అనుగ్రహం కలగక ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని కొందరు భక్తులు ఆగ్రహంగా ఉన్నారు. కొత్త కొత్త రూపాల్లో గణేష్ విగ్రహాలు తయారు చేసినా ఎవరూ కొనొద్దంటూ వారు సూచిస్తున్నారు.

 

 

కానీ విగ్రహ తయారీదారులు చెప్పేది కూడా ఆసక్తికరంగానే ఉంది. ఇటీవల కాలంలో జనాల్లో డైట్ మెయింటెనెన్స్ బాగా పెరిగిందని, ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. 6ప్యాక్, 8ప్యాక్ ఆకారాల్లో ఉండేందుకు శ్రమిస్తున్నారని అందుకోసమే మేము సైతం విగ్రహాలను అలా మలుస్తున్నట్లు తయారీదారులు అంటున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉండేలా ప్రజల్లో చైతన్యం చేస్తున్నట్లు చెబుతున్నారు.

 

మొత్తానికి ఈసారి మరి కొత్త తరహా గణేషు రూపాల కోసం జనాలు ఎదురుచూపులు ఫలిస్తాయా లేక భక్తుల కోరిక మేరకు నిజమైన గణేష్ ఆకారంలో దర్శనమిస్తరా అన్నది ఇంకొద్ది రోజుల్లో తేలనుంది.

click me!