బరి తెగించిన బడిపంతులు ఏం చేశాడో తెలుసా ?

Published : Jun 27, 2017, 11:38 AM ISTUpdated : Mar 25, 2018, 11:42 PM IST
బరి తెగించిన బడిపంతులు ఏం చేశాడో తెలుసా ?

సారాంశం

చిన్నారులకు విద్యాబుద్దులు చెప్పాల్సిన బడిపంతులు ఆయన. ఆయన చేసిన పని తెలిస్తే ముక్కు మీద వేలేసుకుంటారు. ఛీ, థూ అని ఛీదరించుకుంటారు. పాఠాలు చెప్పాల్సిన బడిపంతులు ఇలా చేయడమేంటని ఈసడించుకుంటారు. ఎవరేమనుకుంటే నాకేంటని ఆ బడిపంతులు బరితెగించి ఎలా చెలరేగిపోయాడంటే...

తరగతి గదిలోనే భావి భారత పౌరులు తీర్చిదిద్దబడతారని పెద్దలు ఎప్పుడో సెలవిచ్చారు. కానీ ఆ పాఠశాల పంతులు మాత్రం అదేం పట్టించుకోలేదు. బడిని గుడిగా భావించి ఎందరికో స్పూర్తినిచ్చిన పంతుళ్లు  కొందరుంటే మరికొందరు మాత్రం దిగజారిన పనులు చేస్తూ వ్యవస్థను చెడగొడుతున్నారు. అలాంటి కోవకు చెందిన ఈ బడిపంతులు కథ చదవండి.

 

నాగర్ కర్నూలుకు 20 కిలోమీటర్ల దూరంలోని తెలకపల్లి మండలంలోని ఆలేరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు చట్టవిరుద్ధంగా బెల్ట్‌షాపునకు వేలంపాట నిర్వహించాడు. ఆయన చేసిన ఈ నిర్వాకానికి స్థానిక ప్రజాప్రతినిధులూ సహకరించారు. గ్రామంలో బెల్టు షాపు ఎవరు నిర్వహించాలన్న విషయంలో వివాదం నెలకొంది. దీంతో అందరు వ్యాపారులూ కలిసి మద్యం షాపు వేలం వేసి ఎవరు ఎక్కువకు పాడితే వారే బెల్టు షాపు నిర్వహించుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.

 

అనుకున్నట్లుగానే ఆ గ్రామంలో మద్యం అమ్మకాల కోసం గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుల అధ్యక్షతన ఆదివారం ప్రభుత్వ పాఠశాలలో గ్రామ ప్రజల సమక్షంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు బెల్ట్‌షాపు కేటాయింపుపై వేలంపాట నిర్వహించాడు. సుమారు ఈ వేలంపాటకు 200 మందికి పైగానే హాజరయ్యారు. అందులో 13 మంది వేలంపాటలో పాల్గొన్నారు. ఒక్కొక్కరు రూ.5 వేలు డిపాజిట్‌ చేసి వేలం పాడగా, వారిలో ఒకరు రూ.3 లక్షల 15 వేలకు వేలం దక్కించుకున్నారు.

 

ఈ సంఘటన అందరికీ ఆశ్చర్యాన్ని, ఆవేదనను కలిగిస్తోంది. నిత్యం పిల్లలకు విద్యాబుద్ధులు బోధించాల్సిన ఉపాధ్యాయుడే వేలంపాట కార్యక్రమాన్నిముందుండి నడిపించడం పట్ల ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తెలకపల్లి మండలం ఆలేరు గ్రామ జనాభా 3,500 ఉంటుంది. ఈ గ్రామంలో ప్రస్తుతం 15 బెల్ట్‌ షాపుల ద్వారా ప్రతిరోజూ రూ.50 వేలకు పైగా అక్రమంగా మద్యం వ్యాపారం జరుగుతున్నట్లు తెలుస్తోంది.

 

ఆలేరులో పాఠశాలలో వేలం నిర్వహించినట్లుగా వాట్సాప్‌లో ఫిర్యాదులు అందాయని, వేలం నిర్వహించిన వారిపైనా.. గ్రామంలో అక్రమంగా మద్యం దుకాణాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్‌ ఈఎస్‌ శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. మరి తూ.తూ.మంత్రంగా చర్యలు తీసుకుంటారా లేక నిజంగానే చర్యలు తీసుకుంటారా అన్నది తేలాల్సిఉంది.

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే