యాదాద్రి జిల్లాలో మూడు రోజుల క్రితం వాగులో యువతి గల్లంతు: నేడు మృతదేహం లభ్యం

By narsimha lodeFirst Published Sep 2, 2021, 3:18 PM IST
Highlights

యాదాద్రి భువనగరి జిల్లాలో మూడు రోజుల క్రితం దోసలవాగు వద్ద ఇద్దరు యువతులు గల్లంతయ్యారు. అదే రోజున సింధూజ ను కాపాడారు. ఇవాళ హిమబిందు డెడ్ బాడీ లభ్యమైంది. స్కూటీ వాగులో చిక్కుకుని ఇద్దరు గల్లంతైన విషయం తెలిసిందే.
 

భువనగరి: యాదాద్రి భువనగరి జిల్లాలో వాగులో కొట్టుకుపోయిన  హిమబిందు డెడ్‌బాడీ గురువారం నాడు లభ్యమైంది. ఈ నెల 30వ తేదీన వాగులో  ఇద్దరు యువతులు గల్లంతయ్యారు. అదే రోజున సింధూజను కాపాడారు. కానీ హిమబిందు మాత్రం లభ్యం కాలేదు. రాజాపేట మండలం కుర్రారం గ్రామ సమీపంలో దోసల వాగులో ఇద్దరు యువతులు గల్లంతయ్యారు.

ఇటుకలపల్లి నుండి కుర్రారం వైపు స్కూటీపై ఇద్దరు యువతులు సహా ఓ యువకుడు వెళ్లున్న సమయంలో  రాజపేట మండలం దోసలవాగు వద్ద ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ వాగులో వరద ఉధృతిని తక్కువగా అంచనా వేసి స్కూటీని ముందుకు పోనిచ్చారు. 

also read:యాదాద్రి జిల్లాలో వాగులో ఇద్దరు యువతుల గల్లంతు: ఒకరిని కాపాడిన పోలీసులు, మరొకరి కోసం గాలింపు

వాగులో వరద ఉధృతికి స్కూటీ నీటిలో చిక్కుకుపోయింది. స్కూటీ పై నుండి హిమబింధు, సింధూజలు దిగారు. వాగులో వరద ఉధృతి కారణంగా హిమబింధు, సింధూజలు కొట్టుకుపోయారు.ఈ సమాచారం అందుకొన్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొన్నారు.

స్థానికుల సహాయంతో సింధూజను వరద నుండి బయటకు తీశారు. హిమబింధు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వరద నీటి నుండి బయట పడిన సింధూజను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇవాళ హిమబిందు మృతదేహం లభ్యమైంది.
 

click me!