ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుపై కేసు

By narsimha lodeFirst Published Sep 2, 2021, 2:38 PM IST
Highlights


ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. భైంసా అల్లర్ల బాధితుల గృహ ప్రవేశం సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఎంపీపై కేసు నమోదు చేశారు పోలీసులు.


నిర్మల్: ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుపై  పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.  భైంసా అల్లర్ల బాధితుల గృహ ప్రవేశం కార్యక్రమంలో ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఎంపీ సోయం బాపూరావుపై కేసు నమోదు చేశారు. పోలీసులు.భైంసా అల్లర్ల బాధితులకు సేవా భారతి సంస్థ  కొత్త ఇళ్లను నిర్మించింది.

2020 జనవరి మాసంలో భైంసాలో జరిగిన అల్లర్లలో 10 ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఇళ్లు కోల్పోయిన వారికి సేవాభారతి సంస్థ అండగా నిలిచింది. 10 ఇళ్లను  ఆ సంస్థ నిర్మించింది.  కోటి రూపాయాలతో ఈ 10 ఇళ్లను నిర్మించారు. కొత్త ఇళ్లలో గృహ ప్రవేశాలను బుధవారంనాడు సామూహిక గృహ ప్రవేశాలు చేయించారు.

సామూహిక గృహ ప్రవేశాల సందర్భంగా ఎంపీ బాపురావు ఈ వ్యాఖ్యలు చేశారు.  ఈ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని పోలీసులు కేసు నమోదు చేశారు. 
భైంసాలో  రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగిన ఘటనలు గతంలో చోటు చేసుకొన్నాయి. . 

click me!