తెలంగాణ నిర్భయ హత్య: బహిరంగంగా శిక్షించాలన్న జీయర్ స్వామి

Published : Dec 02, 2019, 12:34 PM IST
తెలంగాణ నిర్భయ హత్య: బహిరంగంగా శిక్షించాలన్న జీయర్ స్వామి

సారాంశం

సమాజంలో మృగాళ్ల వ్వవహరిస్తున్న వారిని బహిరంగంగా ఉరితీయాలని త్రిదండి చినజీయర్ స్వామి డిమాండ్ చేశారు.  

హైదరాబాద్:  సమాజంలో మృగాళ్లలా ప్రవర్తిస్తున్న కిరాతకులను బహిరంగంగా కఠినంగా శిక్షిస్తే భవిష్యత్తులో ఈ తరహ ఘటనలు పునరావృతం కావని  చినజీయర్ స్వామి అభిప్రాయపడ్డారు.

Also read:వెటర్నరీ డాక్టర్ రేప్, హత్య కేసు: నిందితులు వెనక్కి వచ్చి చూసి....

దిశ పై గ్యాంగ్ రేప్,హత్య కేసుపై చినజీయర్ స్వామి స్పందించారు. ఆదివారం నాడు ఆయన ఈ విషయమై స్పందించారు. నేరం రుజువైన నేరస్తులను వెంటనే బహిరంగంగా శిక్షించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఈ తరహా ఘటనలపై  విచారణ పేరుతో  ఏళ్ల తరబడి సంరక్షించడం సరైంది కాదన్నారు. ఇలాంటి వారిని ఏళ్లతరబడి సంరక్షించడం సమాజానికి నష్టమేనని ఆయన అభిప్రాయపడ్డారు.ఆంగ్లేయుల పాలనలో రూపొందించిన ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందని చినజీయర్ స్వామి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్