తెలంగాణలో కొత్తగా ఐదు ఒమిక్రాన్ కేసులు.. 84కి చేరిన బాధితుల సంఖ్య

By Siva Kodati  |  First Published Jan 2, 2022, 9:18 PM IST

కరోనా (coronavirus) కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (omicron) తెలంగాణలో విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఐదుగురికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 84కి చేరుకుంది.


కరోనా (coronavirus) కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (omicron) తెలంగాణలో విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఐదుగురికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 84కి చేరుకుంది. కొత్త వేరియంట్ సోకిన వారిలో 32 మంది కోలుకున్నారని తెలిపింది. తెలంగాణలో గత 24 గంటల వ్యవధిలో ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి 163 మంది శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి (shamshabad airport) చేరుకున్నారు. వారందరికీ కొవిడ్‌ ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టులు చేయగా 14 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వారి నమూనాలను అధికారులు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు. ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి మొత్తంగా ఇప్పటి వరకు 12,855 మంది తెలంగాణకు వచ్చారు.  

ఇక.. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 21,679 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 274 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 6,82,489కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 4,030కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 227 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రస్తుతం 3,779 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  

Latest Videos

undefined

Also Read:Omicron ఎఫెక్ట్: బెంగాల్‌లో రేపటి నుండి విద్యా సంస్థల మూసివేత

మరోవైపు.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం వెల్లడించిన కరోనా వైరస్ వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 27,553 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో వైరస్ తో పోరాడుతూ 284 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసులు సైతం పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 1,22,801 క్రియాశీల కేసులు ఉన్నాయి.  కొత్తగా 9,249 మంది కరోనా వైరస్ నుంచి బటయపడ్డారు. ఒమిక్రన్ కేసులు సైతం పెరిగాయి. ఇప్పటివరకు దేశంలో 1525 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 

click me!