సెక్రెటేరియట్ కూల్చివేతపై నివేదిక కోరిన హైకోర్టు

Published : Nov 01, 2016, 06:04 AM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
సెక్రెటేరియట్ కూల్చివేతపై నివేదిక కోరిన హైకోర్టు

సారాంశం

సెక్రెటేరియట్ కూల్చివేతపై నివేదిక కోరిన హైకోర్టు, పదిరోజుల గడువు,గడువు లోపు కూల్చివేత వద్దు

తెలంగాణా సచివాలయం భవనాలను కూల్చివేయాలన ప్రతిపాదన మీద ఒక సమగ్ర నివేదికసమర్పించాలని హైదరాబాద్ హైకోర్టు తెలంగాణా ప్రభుత్వాన్ని అదేశించింది. పదిరోజులలోపు నివేదిక ఇవ్వాలని, ఈ మధ్యకాలంలో ఎలాంటి కూల్చివేత చెప్పట్టారదని కోర్టు స్పష్టం చేసింది.

 సెక్రెటేరియట్ కూల్చివేతకు  వ్యతిరేకంగా  కాంగ్రెస్ శాసనసభ్యులు  జీవన్ రెడ్డి,  కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పరిశీలిస్తున్న కోర్టు మంగళవారం నాడు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తుపేరుతో  ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నందున, కోట్లాది రుపాయల ప్రజాధనం వృథా అవుతుందని పిటిషనర్ల తరఫు న్యాయవాది సత్యంరెడ్డి వాదించారు.

 

  వాస్తు పేరుతో ప్రస్తుత సచివాలయంలోని ఎనిమిది భవనాలను కూల్చేసి అదే స్ధానంలో వాస్తు శాస్త్రానికి అనుగుణంగా పక్కాగా కొత్త భవనాలను కట్టాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించిన విషయం తెలిసింది. . అందుకు తగ్గట్లుగానే చాలా కాలంగా వ్యూహరచన చేస్తున్నారు. భవనాలను యుధ్ద ప్రాతిపదికను ఖాళీ చేయిస్తున్నారు.

ప్రస్తుతం తెలంగాణా ప్రభుత్వం ఆధీనంలో ఉన్న నాలుగు బ్లాకులను మాత్రమే కాకుండా ఏపి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మిగిలిన నాలుగు బ్లాకులను కూడా తీసుకుని కూల్చేయాలని కెసిఆర్ ప్రయత్నిస్తున్నారు. అందుకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ కూడా కెసిఆర్ కు సహకరిస్తున్నారు. ఆంధ్ర  అధీనంలో ఉన్న బ్లాక్ లను  వెనక్కి వచ్చేలా గవర్నర్ రాయబారం కూడా నెరిపారని చెబుతారు.

 

PREV
click me!

Recommended Stories

KTR Comments: "లంగా మాటలు దొంగ మాటలు "రేవంత్ రెడ్డి పై కేటిఆర్ పంచ్ లు| Asianet News Telugu
Revanth Reddy vs KTR | రేవంత్ రెడ్డి vs కేటిఆర్ డైలాగ్ వార్ | Asianet News Telugu