నవంబర్ 7న కాంగ్రెస్ సంగారెడ్డి కలెక్టరేట్ ముట్టడి

First Published Oct 31, 2016, 10:41 AM IST
Highlights
  • టిఆర్ ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల సమీకరిస్తున్న కాంగ్రెస్ 
  • నవంబర్  ఏడున సంగారెడ్డి కలెక్టరేట్ ముట్టడి

లక్షలాది మంది విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్  చేయనందుకు నిరసనగా  కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నది. పార్టీ నాయలకులందరిని  ఈ ఉద్యమంలోకి దించి వారి జిల్లాలలో ఎన్ఎస్ యుఐ అధ్వర్యంలో సభలు సమావేశాలే కాకుండా ధర్నాలునిర్వహించేందుకుపూనుకుంది. రాష్ట్ర వ్యాపితంగా విద్యార్థులను రోడ్ల మీదికి రప్పించి బలమయిన విద్యార్థి ఉద్యమం నిర్వహించి ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిర చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తూ ఉంది.

 

ఒక వైపు నుంచి రైతులను,మరొక వైపు నుంచి  విద్యార్థులను కెసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమీకరించాలన్నది కాంగ్రెస్ వ్యూహం. ఇందులో భాగంగా సంగారెడ్డి కాంగ్రెస్ నాయకుడు,మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి   నవంబర్ ఏడున  సంగారెడ్డి కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు.

 

ఈ విషయం ప్రకటిస్తూ ఉద్యమాల ద్వారా ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామని, అంత వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదని జగ్గారెడ్డి ప్రకటించారు.  ’ లక్షలాది మంది విద్యార్థులను కేసీఆర్ మోసం చేస్తున్నారు.  స్టూడెంట్స్ తో పెట్టుకుంటే తట్టుకోలేవు నీకు పుట్టగతులు ఉండవు, ,’అని ఆయన ముఖ్యమంత్రి హెచ్చరించారు.

 

కేసీఆర్ వంద అబద్ధాల శిశుపాలుడిల ప్రవర్తిస్తున్నాడని అంటూ  రానున్న ఎన్నికల్లో ప్రజలే ఆయనకు బుద్ది చెబుతారన్నారని అన్నారు. ప్రభుత్వ అనుసరిస్తున్నవిద్యార్థి వ్యతిరేఖ  వైఖరికి నిరసనగా ఈ నెల 7న సంగారెడ్డిలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నమని ఇందులోచాలా మంది విద్యార్థులు, సీనియర్  పార్టీ నాయకులు పాల్గొంటారని ఆయన చెప్పారు.

click me!