రవిప్రకాష్‌కు చుక్కెదురు: ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

By narsimha lodeFirst Published May 22, 2019, 6:17 PM IST
Highlights

 టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్‌కు హైకోర్టులో బుధవారం నాడు  చుక్కెదురైంది. రవిప్రకాష్ బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్‌  ముందస్తు బెయిల్ పిటిషన్‌పై  బుధవారం నాడు హైకోర్టులో వాదనలు జరిగాయి.

హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్‌కు హైకోర్టులో బుధవారం నాడు  చుక్కెదురైంది. రవిప్రకాష్ బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్‌  ముందస్తు బెయిల్ పిటిషన్‌పై  బుధవారం నాడు హైకోర్టులో వాదనలు జరిగాయి.

 టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది దిల్‌జిత్ సింగ్ ఆహ్లువాలియా వాదించారు.  నేషనల్ లా కంపెనీ ట్రిబ్యునల్ లో కేసు నడుస్తున్న సమయంలో రవిప్రకాష్ పై అక్రమంగా కేసులు నమోదు అహ్లువాలియా హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఒకే వ్యక్తిపై మూడు కేసులు నమోదు చేశారని చెప్పారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని  హైకోర్టును కోరారు.ఇదిలా ఉంటే  రెండు దఫాలు విచారణకు హారుకావాలని రవిప్రకాష్‌కు నోటీసులు జారీ చేసినా కూడ హాజరుకాలేదని  ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 

వాట్సాప్ కాల్‌ ద్వారా రవిప్రకాష్ అందరితో సంబంధాలు కలిగి ఉన్నాడని  ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.  రవిప్రకాష్ ను అరెస్ట్ చేస్తామని తాము చెప్పలేదని ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.  పోలీసుల విచారణకు హాజరుకావాలని మాత్రమే కోరినట్టుగా ప్రభుత్వ తరపు న్యాయవాది కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.రవిప్రకాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను  రెండు దఫాలు హైకోర్టు  కొట్టేసింది.

సంబంధిత వార్తలు

రవిప్రకాష్ ఆరోపణలకు టీవీ9 యాజమాన్యం కౌంటర్

తప్పుడు కేసులు: టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్

ముందస్తు బెయిల్‌ కోసం రవిప్రకాష్ మరో పిటిషన్

click me!