
తెలంగాణ రాజకీయ జేఏసీ రేపు నిర్వహించనున్న నిరుద్యోగ నిరసన ర్యాలీపై హైకోర్టు ఎట్టకేలకు తీర్పునిచ్చింది.
రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సభ నిర్వహించుకోవచ్చిన అనుమతిచ్చింది.
నాగోల్ మెట్రో స్థలంలో సభ ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. అయితే కోర్టు తీర్పుపై టీ జేఏసీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
కోరిన చోట అనుమతి ఇవ్వకపోవడంతో టీ జేఏసీ తమ పిటిషన్ ను వెనక్కి తీసుకుంది.
కాగా, హైకోర్టు తీర్పుపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై కోదండరాం టీ జేఏసీ నేతలతో చర్చిస్తున్నారు.
ర్యాలీ నిర్వహణపై మరికొద్ది గంటల్లో టీ జేఏసీ నిర్ణయం తీసుకోనుంది.