హైద్రాబాద్‌లోనే తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికలు:హైకోర్టు

By narsimha lodeFirst Published Feb 3, 2020, 6:22 PM IST
Highlights

హైద్రాబాద్ లోనే తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. 

హైదరాబాద్: హైద్రాబాద్‌లోనే తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించేందుకు హైకోర్టు సోమవారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికలను ఢిల్లీలో నిర్వహించనున్నట్టుగా నిర్వాహకులు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఢిల్లీలో తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించడాన్ని జగన్మోహాన్ రావు వర్గం హైకోర్టులో ఛాలెంజ్ చేసింది.  ఢిల్లీలో ఎన్నికల నిర్వహించవద్దని హైకోర్టు చెప్పింది.

Also read:తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు: కోర్టుకెళ్లనున్న జయేశ్ ప్యానెల్

ఢిల్లీలో కాకుండా హైద్రాబాద్‌లోనే ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేయడంతో  జగదీష్ యాదవ్ వర్గానికి ఎదురు దెబ్బ తగిలినట్టైంది. తెలంగాణ ఒలింపిక్ భవన్, సంఘం కార్యాలయం అన్నీ ఇక్కడే ఉంచుకుని ఎన్నికలు న్యూఢిల్లీలో నిర్వహిస్తామంటే కుదరదని హైకోర్టు అభిప్రాయపడింది.

ఓటర్ల జాబితా తయారీపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది హైకోర్టు. రెండు పర్యాయాలు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి మరోసారి ఎలా అదే పదవికి పోటీ చేస్తావని జగదీష్ యాదవ్ ను హైకోర్టు ప్రశ్నించింది. 

ఇప్పటివరకు జరిగిన ఎన్నికల తతంగం లోపభూయిష్టంగా విమర్శలకు తావిచ్చేందుగా‌ ఉందని జగదీష్ వర్గంపై హైకోర్టు అక్షింతలు వేసింది. ఇదిలా ఉంటే  ఓటర్ల జాబితా, ఎన్నికల అధికారి నియామకంపై జయేష్ రంజన్ నామినేషన్ పై జగన్మోహాన్ రావు పిటిషన్ దాఖలు చేయనున్నారు.

click me!