నాపై లైంగిక దాడి: బీజేపీ నేత రఘునందన్‌రావుపై మహిళ ఫిర్యాదు

Published : Feb 03, 2020, 04:22 PM IST
నాపై లైంగిక దాడి: బీజేపీ నేత రఘునందన్‌రావుపై మహిళ ఫిర్యాదు

సారాంశం

తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత రఘునందన్ రావు తనపై లైంగిక దాడికి పాల్పడినట్టుగా ఓ మహిళ సైబరాబాద్ సీపీ సజ్జనార్ కు ఫిర్యాదు చేసింది. 

హైదరాబాద్: బీజేపీ నేత రఘునందన్ రావు తనపై లైంగిక దాడికి పాల్పడినట్టుగా  ఓ మహిళ సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేసింది.

ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన రఘునందన్ రావు తనపై లైంగిక దాడికి పాల్పడినట్టుగా మహిళ సీపీ సజ్జనార్ కు ఫిర్యాదు చేసింది. అంతేకాదు  ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని ఆమె సీపీని కోరింది.

సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేయడానికి ముందే  మానవ హక్కుల  సంఘానికి ఫిర్యాదు చేసినట్టుగా బాధితురాలుచెప్పింది.రఘునందన్ రావు తొలుత టీఆర్ఎస్‌లో ఉన్నాడు. టీఆర్ఎస్‌లో రఘునందన్ రావు ఎక్కువ కాలం ఉండలేదు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కీలక నేతల్లో ఆయనకు చోటు దక్కింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Sanjay Jaju : రేవంత్ రెడ్డి టీమ్ లో కొత్త ఐఏఎస్... ఎవరీ సంజయ్ జాజు?
హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం త్వ‌ర‌లోనే మ‌రో మియాపూర్ కావ‌డం ఖాయం.. ఇప్పుడు కొన్న‌వాళ్లు అదృష్ట‌వంతులు