మంత్రి ఎర్రబెల్లికి తాకిన కరోనా సెగ... పిఏ, గన్ మెన్లతో సహా ఆరుగురికి పాజిటివ్

By Arun Kumar PFirst Published Jul 27, 2020, 11:42 AM IST
Highlights

రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పీఏ, ఇద్దరు గన్ మెన్లు, డ్రైవర్, ఓ కానిస్టేబుల్ తో పాటు  మరికొందరు సహాయకులకు కూడా కరోనా సోకింది. 

వరంగల్: తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. సామాన్యులే కాదు రాజకీయ ప్రముఖులు, సినీ, వ్యాపార ప్రముఖులు సైతం ఈ వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పీఏ, ఇద్దరు గన్ మెన్లు, డ్రైవర్, ఓ కానిస్టేబుల్ తో పాటు  మరికొందరు సహాయకులకు కూడా కరోనా సోకింది. దీంతో వరంగల్ టీఆర్ఎస్ పార్టీతో పాటు ఎర్రబెల్లి కుటుంబంలో కలకలం మొదలయ్యింది. 

వరంగల్ జిల్లా పర్వతగిరిలోని స్వగృహంలోనే మంత్రి వద్ద పనిచేసే ప్రతి ఒక్కరికి జిల్లా వైద్యాధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఆరుగురికి పాజిటివ్ నిర్దారణ అయ్యింది. దీంతో అధికారులు వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. అయితే వారికి కరోనా లక్షణాలు లేకపోవడంతో క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. 

read more   కరోనా భయం.. భార్య, కూతురిని చంపేసి..

అయితే మంత్రి ఎర్రబెల్లి చుట్టుపక్కల వుండేవారికి కరోనా పాజిటివ్ గా తేలడంతో జిల్లాలో కలకలం మొదలయ్యింది. ఇటీవల మంత్రితో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజల్లో ఆందోళన మొదలయ్యింది.

ఇదిలావుంటే మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆదివారం 1593 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య  54,059కి చేరుకొన్నాయి.

అయితే ఆదివారం ఒక్కరోజే 998 మంది కరోనా నుండి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 41,332 మంది కరోనా నుండి కోలుకొన్నారు. అంతేకాదు ఒక్క రోజులో 8మంది మరణించారు. రాష్ట్రంలో 463 మంది కరోనాతో మరణించినట్టుగా ప్రభుత్వం తెలిపింది.కరోనాతో మరణించిన డెత్ రేట 2.3గా ఉంది. రాష్ట్రంలో ఇంకా 12,264 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

 ఇప్పటివరకు రాష్ట్రంలో 3,53,425 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.గత 24 గంటల్లో 54,059 మందికి టెస్టులు నిర్వహిస్తే 1593 మందికి కరోనా సోకిందని తేలింది.

జిల్లాల వారీగా కరోనా కేసులు

ఆదిలాబాద్-14
భద్రాద్రి కొత్తగూడెం-17
జీహెచ్ఎంసీ -641
జగిత్యాల-02
జనగామ-21
జయశంకర్ భూపాలపల్లి-03
జోగులాంబ గద్వాల -05
ఖామారెడ్డి-36
కరీంనగర్-51
ఖమ్మం-18
కొమరంభీమ్-0
మహబూబ్‌నగర్-38
మంచిర్యాల-27
మెదక్-21
మేడ్చల్ మల్కాజిగిరి-91
ములుగు-12
నాగర్‌కర్నూల్-46
నల్గొండ-06
నారాయణపేట-07
నిర్మల్-01
నిజామాబాద్-32
పెద్దపల్లి-16
రాజన్న సిరిసిల్ల-27
రంగారెడ్డి-171
సంగారెడ్డి-61
సిద్దిపేట-05
సూర్యాపేట-22
వికారాబాద్-09
వనపర్తి-01
వరంగల్ రూరల్-21
వనపర్తి అర్బన్-131
యాదాద్రి భువనగిరి-11

 

click me!