సింగరేణి వారసత్వ ఉద్యోగాలకు హైకోర్టు నో

First Published Mar 16, 2017, 6:19 AM IST
Highlights
  • హైకోర్టులో తెలంగాణకు ఎదురుదెబ్బ

సింగరేణి కాలరీస్ లో వారసత్వ ఉద్యోగాలకు హైకోర్టు మోకాలడ్డింది. ఇలాంటి నియామకాలు చెల్లవని తీర్పునిచ్చింది. ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాలకు జారీ చేసిన నోటిఫికేషన్ ను కొట్టేసింది.

 

ఇటీవల కేసీఆర్ ప్రభుత్వం సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు అనుమతినిస్తున్న ఉత్తర్వలు జారీ చేసిన విషయం తెలిసిందే.

 

అయితే సింగరేణి కాలరీస్ లో వీఆర్‌ఎస్‌ తీసుకున్న కార్మికుల కుటుంబ సభ్యులతో 30వేల ఉద్యోగాల భర్తీ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో గోదావరి ఖనికి చెందిన కె.సతీశ్‌కుమార్‌ పిటిషన్ వేశారు.

 

దీనిపై వాదనలు విన్న హైకోర్టు జడ్జీలు వారసత్వ నియామకాలపై సంస్థ ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవని తీర్పునిచ్చింది.

 

మెడికల్ ఫిట్ నెస్ సరిగా లేని వారు మాత్రమే వారి ఉద్యోగాలను వారసులకు ఇచ్చేందుకు అర్హత ఉంటుందని పేర్కొంది.

 

వారసత్వ ఉద్యోగాలపై ప్రస్తుతం జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేయాలని ఆదేశించింది.

 

మెడికల్ ఫిట్ నెస్ లేనివారి కోసం మాత్రమే వారసత్వ ఉద్యోగాలు ఇచ్చేలా కొత్త నిబంధనలతో మరో నోటిఫికేషన్ జారీ చేయవచ్చని సూచించింది.

click me!