జంతర్ మంతర్ లో ధర్నా చేస్తా

Published : Mar 15, 2017, 02:32 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
జంతర్ మంతర్ లో ధర్నా చేస్తా

సారాంశం

రిజర్వేషన్ల పెంపుపై సీఎం కేసీఆర్

రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలు, వాల్మికి బోయిలకు కచ్చితంగా రిజర్వేషన్లు అమలు చేస్తామని, ఈ విషయంలో కేంద్రం చొరవ చూపకపోతే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ రోజు అసెంబ్లీలో ఆయన రిజర్వేషన్ల పెంపుపై మాట్లాడారు.

 

భూమి, ఆకాశం ఏకం చేసైనా గిరిజనులు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. వాల్మీకి బోయలు, కాయిత లంబాడీలను ఎస్టీల్లో చేర్చితే వారి జనాభా కూడా అటూ ఇటుగా 12 శాతం అవుతుందని వివరించారు. తమిళనాడు తరహాలో జనాభా ప్రాతిపదికన వారికి రిజర్వేషన్లు కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.

 

సభలో చట్టం చేసి అవసరమైతే  కేంద్రం దగ్గరికి అందరం వెళ్లి ఆమోదం కోసం పోరాటం చేద్దామని అన్నిపార్టీల సభ్యులను ఉద్దేశించి ప్రకటించారు. ఈ విషయంలో అవసరమైతే అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశం పెడతానని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

PREV
click me!

Recommended Stories

Weather Update : బంగాళాఖాతంలో అల్పపీడనం రెడీ... తెలుగు రాష్ట్రాలపై స్ట్రాంగ్ ఎఫెక్ట్, ఈ జిల్లాల్లో ఇక వర్షబీభత్సమే
80s AI: ట్రెండ్ ఫాలో అవుతోన్న సీఎం సాబ్‌.. రేవంత్ రెడ్డి రెట్రో లుక్ చూశారా.?