అసెంబ్లీ రద్దు పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

By sivanagaprasad KodatiFirst Published Sep 12, 2018, 12:43 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ రద్దుపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అసెంబ్లీ రద్దులో రాజ్యాంగ ఉల్లంఘన లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. 

తెలంగాణ అసెంబ్లీ రద్దుపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అసెంబ్లీ రద్దులో రాజ్యాంగ ఉల్లంఘన లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ 9 నెలల ముందుగానే అసెంబ్లీని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ..న్యాయవాది రాపోలు భాస్కర్ గత శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ప్రభుత్వానికి ఇంకా 9 నెలల కాలపరిమితి ఉండగానే అసెంబ్లీని రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని... ఇలా చేయడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికల వలన కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని అభిప్రాయపడ్డారు.. ఐదు సంవత్సరాల కాలపరిమితి పూర్తయ్యే వరకు ఎలాంటి ఎన్నికలు జరగకుండా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలని భాస్కర్ కోరారు. 

click me!