మాదాపూర్ డ్రగ్స్ కేసు .. పరారీలో సినీ హీరో నవదీప్ : సీపీ సీవీ ఆనంద్

Siva Kodati | Updated : Sep 14 2023, 07:16 PM IST
Google News Follow Us

సారాంశం

మాదాపూర్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో హీరో నవదీప్ పరారీలో వున్నాడని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. 

మాదాపూర్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో హీరో నవదీప్ పరారీలో వున్నాడని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. డ్రగ్స్ వ్యవహారంలో కస్టమర్‌గా నవదీప్ వున్నాడని ఆయన చెప్పారు. అలాగే ఇదే కేసులో మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్‌ను అరెస్ట్ చేశానని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. నవదీప్ స్నేహితుడు రాంచంద్‌ను అదుపులోకి తీసుకున్నామని సీపీ చెప్పారు. రాంచంద్‌ ద్వారా నవదీప్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు తెలిసిందన్నారు. షాడో ప్రొడ్యూసర్ రవి ఉప్పలపాటి కూడా పరారీలో వున్నాడని ఆనంద్ వెల్లడించారు. గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసులోనూ నవదీప్ అభియోగాలు ఎదుర్కొన్నారు. అప్పట్లో ఎక్సైజ్, ఈడీ విచారణకు కూడా ఆయన హాజరయ్యారు. 

అయితే మీడియాలో వస్తున్న కథనాలపై నవదీప్ స్పందించారు. తాను ఎక్కడికి పారిపోలేదని, హైదరాబాద్‌లోనే వున్నానని ప్రముఖ వార్తా సంస్థ ఎన్టీవీ ప్రతినిధికి ఆయన తెలిపారు. డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.