కేసీఆర్ కి 2014లో విలన్ లా కనిపించా, కానీ ఇప్పుడు..: మోహన్ బాబు ట్వీట్

Published : Dec 06, 2018, 10:13 AM ISTUpdated : Dec 06, 2018, 10:55 AM IST
కేసీఆర్ కి 2014లో విలన్ లా కనిపించా, కానీ ఇప్పుడు..: మోహన్ బాబు ట్వీట్

సారాంశం

 తెలంగాణ ముందస్తు ఎన్నికలపై డైలాగ్ కింగ్ మోహన్ బాబు పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముందస్తు ఎన్నికల్లో ఆయన తనయుడు మంచు మనోజ్ ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకీ తన మద్దతు ప్రకటించారు. అలాగే మోహన్ బాబు కూడా కేసీఆర్ కు అనుకూలంగా స్టేట్టమెంట్స్ ఇచ్చారు.   

హైదరాబాద్: తెలంగాణ ముందస్తు ఎన్నికలపై డైలాగ్ కింగ్ మోహన్ బాబు పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముందస్తు ఎన్నికల్లో ఆయన తనయుడు మంచు మనోజ్ ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకీ తన మద్దతు ప్రకటించారు. అలాగే మోహన్ బాబు కూడా కేసీఆర్ కు అనుకూలంగా స్టేట్టమెంట్స్ ఇచ్చారు. 

అయితే తాజాగా ట్విట్టర్ వేదికగా ఆయన కేసీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాయలసీమవాసిగా చెబుతున్నా...2014లో విలన్‌లా కనిపించిన కేసీఆర్‌కి 2018లో నేను అనుకూలంగా మాట్లాడతానని అనుకోలేదు...కారణం ఒక్కటే కష్టపడి ఒక రాష్ట్రాన్ని సాధించుకున్నారు కాపాడుకోండి. 

ఈ కుల జాడ్యం, ఆంధ్రా, సీమలకు తప్పవు... అవి మీకెందుకు... తరిమికొట్టండి’ అంటూ మోహన్‌బాబు ట్విట్టర్‌లో పిలుపునిచ్చారు. ఆంధ్రా, రాయలసీమలలో కుల పరమైన జాఢ్యం ఉంటుందని ఆ జాఢ్యం తెలంగాణలో వద్దంటూ హితవు పలికారు. 

అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడంలో ముందు వరుసలో ఉండే మోహన్ బాబు ఈ వ్యాఖ్యలు చెయ్యడం ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోనే కాదు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికరంగా మారింది. మోహన్ బాబు ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు...తెలంగాణలో చంద్రబాబు పర్యటిస్తున్న నేపథ్యంలో ఆయన్ను ఉద్దేశించా అంటూ గుసగుసలాడుకుంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ