అక్బరుద్దీన్ కి రాఖీ కడతా.. బీజేపీ ఎంపీ

Published : Dec 06, 2018, 09:57 AM IST
అక్బరుద్దీన్ కి రాఖీ కడతా.. బీజేపీ ఎంపీ

సారాంశం

మజ్లిస్ పార్టీ నేత అక్బరుద్దీన్ ఒవైసీకి కనుక తన పద్ధతి మార్చుకుంటే.. రాఖీ కడతానని ప్రకటించారు బీజేపీ ఎంపీ మీనాక్షి

మజ్లిస్ పార్టీ నేత అక్బరుద్దీన్ ఒవైసీకి కనుక తన పద్ధతి మార్చుకుంటే.. రాఖీ కడతానని ప్రకటించారు బీజేపీ ఎంపీ మీనాక్షి.  ఇటీవల అక్బరుద్దీన్ టీఆర్ఎస్, బీజేపీలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా సానుకూల కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్స్ పై ఎంపీ మీనాక్షి.. పై విధంగా స్పందించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేసి గెలిపించాలని ఆమె  ఈ సందర్భంగా కోరారు.

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి రైతుల సమస్యలు, రుణ మాఫీ గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. పంజాబ్‌ రాష్ట్రంలో రూ.200 కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉండగా పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తే.. రైతు సమస్యలు తీరుతాయన్నారు. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ