జూపూడి ఇంట్లో పోలీసుల తనిఖీలు, డబ్బు సంచులతో పారిపోతున్న వ్యక్తి అరెస్ట్ (వీడియో)

Published : Dec 06, 2018, 09:51 AM ISTUpdated : Dec 06, 2018, 11:05 AM IST
జూపూడి ఇంట్లో పోలీసుల తనిఖీలు, డబ్బు సంచులతో పారిపోతున్న వ్యక్తి అరెస్ట్ (వీడియో)

సారాంశం

 ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ నివాసంలో నోట్ల కట్టలు తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. బాలాజీ నగర్ డివిజన్ పరిధిలోని జూపూడి నివాసంలో భారీగా నగదు ఉందంటూ టీఆర్ఎస్ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.   

 

హైదారాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ నివాసంలో నోట్ల కట్టలు తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. బాలాజీ నగర్ డివిజన్ పరిధిలోని జూపూడి నివాసంలో భారీగా నగదు ఉందంటూ టీఆర్ఎస్ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 

అయితే పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు డబ్బు సంచులతో ఇంటి వెనుక నుంచి పారిపోయారు. అయితే వారిని టీఆర్ఎస్ కార్యకర్తలు వెంబడించగా ఒకరిని పట్టుకున్నారు. ఆ యువకుడి వద్ద భారీగా నగదు స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. యువకుడి డబ్బుల మూటలో అన్నీ 500 రూపాయల నోట్లు ఉన్నాయి. 

కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని కోసం ఓట్లు కొనుగోలు చేసేందుకు చంద్రబాబు నాయుడు జూపూడికి డబ్బులు పంపించారని టీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపించారు. డబ్బులు పంచేందుకు ముగ్గురు వ్యక్తులు వచ్చారని ఆ విషయం తెలుసుకుని తాము పోలీసులక ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.  

""

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ