కాంగ్రెస్ లోకి హీరో కృష్ణ..?

Published : Oct 08, 2018, 12:19 PM IST
కాంగ్రెస్ లోకి హీరో కృష్ణ..?

సారాంశం

కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్‌ హీరో కృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు.

సీనియర్ సినీ నటుడు హీరో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా కనపడుతోంది. ఈ ఆరోపణలను నిజం చేసేలా ఇప్పుడు ఒక ఫోటో చక్కర్లు కొడుతోంది. అందులో కృష్ణ.. కాంగ్రెస్ కండువా కప్పుకొని ఉన్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే..  కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్‌ హీరో కృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. శేరిలింగంపల్లి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించాలంటూ ఆదివారం నానక్‌రాంగూడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నానక్‌రాంగూడలో నివాసం ఉంటున్న హీరోకృష్ణ నివాసానికి వెళ్లి ఆయన మద్దతు కోరారు. కృష్ణ సానుకూలంగా స్పందించినట్లు భిక్షపతియాదవ్‌ తెలిపారు. 

ఈ నేపథ్యంలో.. బిక్షపతదియాదవ్ కృష్ణ మెడలో కాంగ్రెస్ కండువాను కప్పారు. దీంతో.. కృష్ణ కాంగ్రెస్ లో చేరుతున్నారనే ప్రచారం మొదలైంది. అయితే.. అలాంటిదేమీ లేదని కాంగ్రెస్ నేతలు తేల్చి చెప్పారు. కేవలం మర్యాదపూర్వకంగా కలిసి ఫోటో దిగినట్లు వివరణ ఇచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు