అక్బరుద్దీన్ పై ముస్లిం యువతిని పోటీకి దింపుతున్న బీజేపీ

By ramya neerukondaFirst Published Oct 8, 2018, 11:32 AM IST
Highlights

అక్బరుద్దీన్ ఓవైసీ చంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా.. ఇప్పుడు ఆయనకు పోటీగా షాహెజాది అనే పాతికేళ్ల యువతిని పోటీకి దింపుతున్నట్లు తెలుస్తోంది. 

తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుచుకునేందుకు విశ్వప్రయత్నాలే చేస్తోంది. ఇందులో భాగంగా అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. ఎంఐఎంఐ నేత అక్బరుద్ధీన్ కి పోటీగా ఓ ముస్లిం యువతిని రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

అక్బరుద్దీన్ ఓవైసీ చంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా.. ఇప్పుడు ఆయనకు పోటీగా షాహెజాది అనే పాతికేళ్ల యువతిని పోటీకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ఆమె గతంలో ఏబీవీపీ కార్యకర్తగా పనిచేశారు. ప్రస్తుతం కోఠి మహిళ కాలేజీలో హిందీ భాషలో మాస్టర్స్ చేస్తోంది. అంతేకాకుండా ఉస్మానియా యూనిర్శిటీలో పొలిటికల్ సైన్స్ లో ఎంఏ కూడా పూర్తి చేసింది.

చంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ఎక్కువ మంది ముస్లింలే నివసిస్తున్నారు. వారంతా ఎక్కువ విద్యావంతులే. దీంతో..బాగా చదువుకున్న ముస్లిం యువతిని నిలబెడితే.. గెలుపు తమ సొంతం అవుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు అయితే.. ఆమెకు సీటుని ఇంకా ఖరారు చేయలేదు. ఆమెకే ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. 

click me!